ప్రియాంకారెడ్డి హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన జరిగిన తీరుపై అంతటా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని చంపేయాలని జనం నినాదాలు చేస్తున్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట గంటల తరబడి ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రియాంకారెడ్డి అత్యాచారం, హత్య ఘటనల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం పైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.

 

సకాలంలో వారు దర్యాప్తు ప్రారంభించలేదని.. మా పరిధి కాదు.. అంటే మా పరిథి కాదు అని రెండు పోలీస్ స్టేషన్ల మధ్య ప్రియాంకారెడ్డి కుటుంబ సభ్యులను తిప్పారని ఆరోపణలు వచ్చాయి. వారు సకాలంలో స్పందించి ఉంటే ప్రియాంకా రెడ్డి ప్రాణాలు కాపాడే వారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఆరోపణలపై పోలీస్ శాఖ కూడా స్పందించింది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.

 

షాద్ నగర్ లో ప్రియాంక రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. శంషాబాద్ ఎస్సై రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ లను పోలీసు కమిషనర్ సజ్జనార్ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరించడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణపై వారిని సస్పెండ్ చేశారు.

 

ప్రియాంకారెడ్డి ఘటన జరిగిన రోజు రాత్రి తొమ్మిదిన్నర వరకూ తన సోదరితో ఫోన్ లో మాట్లాడారు. తాను ఉన్న పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించింది ప్రియాంకారెడ్డి.. తన కు దగ్గర్లోనే లారీ డ్రైవర్ లు ఉన్నారని.. వాళ్లను చూస్తే దయ్యాలను చూసినట్టు ఉందని.. ఆమె ఫోన్లో చెప్పారు.. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ కావడంతో ప్రియాంక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో కూడా నిర్లక్ష్యం వహించారని ముగ్గురిపై ప్రియాంక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: