ఆడ‌పిల్ల బ‌య‌ట‌కు రావాలంటే భ‌య‌ప‌డేలా అయిపోయింది. ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రిగే దారుణాలు ఆ విధంగా ఉంటున్నాయి. ఆడ‌పిల్ల‌ను నిత్యం కంటికి రెప్ప‌లా కాపాడాల్సి వ‌స్తుంది. ఇక ఇదిలా ఉంటే కృష్ణాజిల్లాలో ఓ మ‌హిళ ఓ ఆక‌తాయి తిక్కకుదిర్చింది. రోజూ వెంటపడి వేధిస్తుండడంతో విసుగుచెంది తిరగబడింది.  అప‌ర‌కాళిగా మారింది ఆ జులాయి తాటతీసింది. ఆమెకు స్థానికులు కూడా జత కలవడంతో ఈవ్‌టీజర్‌ ఒళ్లు హూనమైంది. 

 

విజయవాడకు సమీపంలోని కొండపల్లికి చెందిన ఓ వివాహితను సాయి చైతన్య అనే యువకుడు కొద్దికాలంగా వేధిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చింది మొదలు తిరిగి వెళ్లేంత వరకూ వెంటపడుతూ నరకం చూపిస్తున్నాడు. ఈ రోజు కూడా స్కూల్‌లో ఉన్న తన పిల్లలకు క్యారేజ్ ఇచ్చేందుకు వెళ్లి వస్తున్న మహిళను ఆరుపంపుల సెంటర్ వద్ద సాయి చైతన్య అడ్డుకుని వేధింపులకు గురిచేశాడు.

 

ఇప్పటికే పలుమార్లు మందలించిన ఆ మహిళ సహనం నశించి మ‌హంకాళిగా మారింది. తీవ్రంగా తిరగబడింది. ఆ చెంప.. ఈ చెంప వాయించింది. ఓ రేంజ్‌లో వాడి తాట‌తీసింది. స్థానికులు కూడా జత కలవడంతో యువకుడికి దేహశుద్ధి జరిగింది. సాయిని అక్కడే నిర్బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాయి చైతన్యను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్న‌ప్పుడు ఆడ‌వారు కొన్ని సంఘ‌ట‌న‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొంటే చాలా బావుంటుంది. కాని అంద‌రిలోనూ ఆ ధైర్యం ఉండ‌దు. అందుకు త‌గ్గ శిక్షణా సంస్థ‌లు కూడా ఉన్నాయి. మ‌న‌లో మ‌న‌మే ధైర్యాన్ని నింపుకోవాలి. ప్ర‌స్తుతం అన్ని విష‌యాల్లో దూసుకుపోతున్న ఆడ‌వారు ఈ విష‌యంలో కూడా చాలా నిబ‌ద్ధ‌తతో ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. మ‌నం ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ఎప్పుడూ మ‌న వెంట ఒక స‌మాచారం అంద‌జేసేది ఏదైనా ఉంచుకోవాలి. ఫోన్ ఎప్పుడూ మ‌న వెంటే ఉండాలి. అందులో పోలీసుల నెంబ‌ర్లు లేదా మ‌న ఇంటివారి నంబ‌ర్లు ఉండాలి. ప్ర‌తీ నిమిషాన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: