అధికార ప్రతిపక్షాల మధ్య విబేధాలు ఉండడం సహజం, సహేతుక విమర్శలు చేసుకుంటే అందరికీ మంచిది కానీ విమర్శలు తారాస్థాయి కి చేరి దిగజారితే అది తప్పుడు సంకేతాలిస్తుంది ప్రజల్లో చులకన అవుతారు. తాజాగా ఏపీ లో టీడీపీ పార్టీ చేసిన ఒక పని విమర్శలకు దారి తీసింది,  ఛీ ఛీ ఇదేంటి అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. ఏపీ లో ప్రతిపక్ష టీడీపీ పార్టీ దిగజారింది ఏపీ సీఎం జగన్ పై వ్యతిరేక ప్రచారానికి పోర్న్ వెబ్‌సైట్లను ఉపయోగించుకుంది. నిన్న (నవంబర్ 30) తో జగన్ ఆరు నెలల పాలనను పూర్తి చేసుకున్నారు. ఎన్నికల సమయంలో బెస్ట్ సీఎం అనిపించుకుంటా అన్న మాటను నిలబెట్టుకున్నారని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకోగా టీడీపీ శ్రేణులు మాత్రం జగన్ ఈ ఆరు నెలల్లో చేసిందేమి లేదంటూ పెదవి విరిచారు. 

 

ఇంత వరకూ బానే ఉంది కానీ, టీడీపీ సోషల్ మీడియా బ్యాచ్ మాత్రం ఒక డర్టీ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది అది కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పోర్న్ వెబ్‌సైట్లలో టీడీపీ విడుదల చేసిన క్యాప్షన్ తో అశ్లీల వెబ్‌సైట్లలో టాగ్ చేసింది టీడీపీ సోషల్ మీడియా వింగ్. ఈ పోర్న్ వెబ్‌సైట్లలో #6మంత్స్ ఫెయిల్డ్ సీఎం జగన్ అని, సీఎం పై వ్యతిరేక ప్రచారం మొదలెట్టారు. విమర్శించడానికి పోర్న్ వెబ్‌సైట్లను వాడుకోవడమేంటని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

6 నెలల్లో జగన్ చేసిందేంటి, ఆపేసాడు, మూసేసాడు, రద్దు చేసాడు, కూల్చేశాడు, వెనక్కు పంపేశాడు, చేతులెత్తేశాడు, తాకట్టు పెట్టాడు, ముంచేశాడు, మాయ చేసాడు అంటూ "#6మంత్స్ ఫెయిల్డ్ సీఎం జగన్" పాలన పై ఒక పోస్టర్ ను విడుదల చేసింది టీడీపీ. ఇంత వరకూ కేవలం ట్విట్టర్, ఫేసుబుక్ మరియు ఇతర సోషల్ మీడియాల్లో విమర్శలు చూసాం కానీ ఇప్పుడు ఈ వ్యతిరేక ప్రచారం పోర్న్ వెబ్‌సైట్ల వరకూ పాకింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: