రాజకీయాల్లో మానవత్వాలు ఉండవు, మంచితనాలకు తావు లేదు, ఒక్కమాటలో చెప్పాలంటే రాగద్వేషాలు ఇక్కడ అసలు పనిచేయవ్. చాన్స్ దొరికితే వేటు వేసేయడమే. ఇక పదేళ్ళ జగన్ రాజకీయ జీవితం పరిశీలిస్తే అయనకు ప్రధాన ప్రత్యర్ధి టీడీపీ, చంద్రబాబునాయుడు మాత్రమే. ఆ పార్టీ వల్లనే తమ నేత జైలు జీవితం అనుభవించాడని పార్టీ నాయకులు ఒకటికి పదిసార్లు గట్టిగానే  చెబుతారు. అటువంటి టీడెపీ విషయంలో జగన్ నిర్ణయం ఏంటి...

 

ఈ దేశంలో ఇపుడు ఉన్న పొలిటికల్ ట్రెండ్ చూస్తే విలువలు రాజకీయాల్లో అసలు లేవు. నీతి కధకు చెప్పే బీజేపీ సైతం అదే రూట్లోకి వెళ్తోంది. మహారాష్ట్రలోనూ, కర్నాటకలోనూ బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడి అయినా అధికారంలోకి రావాలనుకుంది. సుప్రీంకోర్టు దెబ్బతోనే వెనక్కు తగ్గాల్సివచ్చిందన్నది అందరికీ తెలిసిందే.

 

ఇదిలా ఉండగా తన జమానాలో  చంద్రబాబు వైసీపీని నిర్వీర్యం చేసేందుకు ఎంతలా ప్రయత్నం చేశారో ఆయన అయిదేళ్ళ పాలన చెబుతుంది. ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకుని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఓ దశలో ఏపీ అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని యనమల వంటి వారు బీరాలు పలికారు.

 

ఇంకోవైపు కేంద్రంలో మోడీ సర్కార్ రెండవమారు అధికారంలోకి రాగానే ఏకంగా నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను కలిపేసుకున్నారు. ఇక ఏపీలో ఎవరు వస్తారా అని బీజేపీ ఎదురుచూస్తోంది. అంటే నీతి విలువలు ఇలా పాతాళానికి జారిన‌ సమయంలో ఆరు నెలల జగన్ పాలనలో ఒక్కటి కూడా ఫిరాయింపు లేకపోవడం గొప్ప విషయంగా చెప్పాలి. ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని ఇటీవల కాలంలో దేశంలో గట్టిగా చెప్పిన నాయకుడు ఒక్క జగన్మోహనరెడ్డి మాత్రమే.

 

జగన్ కనుక తలచుకుంటే టీడీపీలో ఈ పాటికి ఎవరు మిగులుతారో కూడా చెప్పలేని పరిస్థితి. ఆరు నెలల వైసీపీ పాలనపైన సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు  ముంచే సీఎం అని  పుస్తకం విడుదల చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. నిజానికి జగనే ముంచే సీఎం అయితే టీడీపీ ఈ పాటీకి ఆ రూపంలో ఉంటుందా, జగన్ మీద పుస్తకం అచ్చేసి మరీ యనమల అక్కడ నిలబడి మాట్లాడేవారా అని మంత్రి కన్నబాబు లాంటి వారు అంటున్నారంటేనే అర్ధం చేసుకోవాలి.

 

జగన్ తలచుకోకపోబట్టే టీడీపీ బతికిపోయిందని మంత్రి గారు అన్న మాటలలో నిజం ఉంది. నిజానికి తెలంగాణాలో కేసీయార్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే విపక్షాన్ని లేకుండా చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు కానీ రాజకీయంలో ఒక్కరే విలువలు అంటూ వేలాడినా ప్రయోజనం కూడా లేదేమో. ఏది ఏమైనా జగన్ పాటిస్తున్న నైతిక విలువలే టీడీపీకి ఆయువు పోస్తున్నాయని రాజకీయ పండితులు కూడా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: