ఘ‌న‌త వ‌హించిన తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఈ విష‌యాల్లో  కూడా ర్యాంకింగ్‌లో నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో దూసుకుపోతున్నాయి. దేశానికి ఆద‌ర్శం మా రాష్ట్రం అని గొప్ప‌గా చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్‌, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులులో దేశంలోనే యువ సీఎంగా కీర్తి పొందుతున్న జ‌గ‌న్‌కు ఈ విష‌యాలు వింటే షాక్ తగ‌లాల్సిందే. అమ్మాయిల‌ను వేధించ‌డంలో తెలంగాణ‌, అత్యాచారాల్లో ఏపీ నెంబ‌ర్‌వ‌న్ పొజిష‌న్‌లో రికార్డు సాధిస్తున్నాయి.

 

ఇక‌పోతే ఎయిడ్స్ వ్యాధి ఎంతటి ప్రాణాంతకమైన వ్యాధో చెప్పనవసరం లేదు. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ (హెచ్ఐవీ) అనే వైరస్ కారణంగా ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధి సోకితే నిర్మూలించడం దాదాపు అసాధ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని హెచ్ఐవీ మహమ్మారీ వెంటాడుతూనే ఉంది. 2017 సంవత్సరంలో దేశం మొత్తం మీద నమోదైన హెచ్ఐవీ కేసుల్లో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో నమోదు కావడం గమనార్హం. 2017 సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నమోదైన కేసుల పరంగా చూస్తే మహిళలను వేధించడంలో తెలంగాణ మొదటిస్థానంలో ఉండగా మహిళలపై జరిగిన అఘాయిత్యాలలో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో ఉందంటే అతిశ‌యోక్తి కాదు.

 

తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 83,102 మంది హెచ్ఐవీ బాధితులున్నారు. 2017 సంవత్సరంలో 9,324 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జిల్లాల ప్రాతిపదికన చూసినా హైదరాబాద్ లోనే హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులు అధికంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ రేపు ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఈ గణాంకాలను వెల్లడించింది. వైద్య వర్గాలు గతంలో యాంటీ రిట్రో వైరల్ ఔషధాలను సీడీ5 కణాల సంఖ్య 500 కంటే తక్కువగా ఉంటే మాత్రమే ఇచ్చేవారు.

 

ప్రస్తుతం హెచ్ఐవీ సోకిందని తెలిసిన వెంటనే ఔషధాలను పంపిణీ చేస్తున్నారు. యాంటీ రిట్రో వైరల్ ఔషధాలను పంపిణీ చేయటం వలన మెరుగైన వైద్య చికిత్స అందుతుందని వైద్యులు చెబుతున్నారు. హెచ్ఐవీ మహమ్మారి భారిన పడి చనిపోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. మరోవైపు శాస్త్రవేత్తలు హెచ్ఐవీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే మందు కనిపెట్టడానికి పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 37 మిలియన్ల హెచ్ఐవీ వ్యాధి వ్యాధిగ్రస్థులున్నారు.

 

1980 సంవత్సరంలో ఈ వైరస్ మొదటిసారి బయటపడింది. 1980 సంవత్సరం నుండి ఇప్పటివరకు 35 మిలియన్ల మంది ఈ వ్యాధి వలన ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏదేమైనా తెలుగు రాష్ట్రాలు అత్యాచారాల్లో, వేధింపుల్లో, ఏయిడ్స్ రోగుల్లో పోటీ ప‌డి మ‌రి ముందుకు పోతున్నాయి. వీటిని నియంత్రించ‌క‌పోతే భ‌విష్య‌త్‌లో తెలుగు రాష్ట్రాల వైపు క‌న్నేత్తి చూడాలన్నా ఎవ్వ‌రు ముందుకు రారు. ఇక‌నైనా సీఎంలు జ‌గ‌న్‌, కేసీఆర్‌లు నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: