ఏపీ సీఎంగా  వైఎస్ జగన్ మోహ‌న్‌రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుని ఆరు నెలలు అయింది. ఈ ఆరునెల‌ల‌ పాలనపై ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు పాలన ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే జ‌గ‌న్‌ను ఈ ఆరు నెల‌ల కాలంలో చేప‌ట్టిన ప‌థ‌కాలు అనేకం ఉన్నాయి. అందులో జ‌గ‌న్‌ను జ‌న‌హీరోగా నిలిపిన ప‌థ‌కాలు చాలా ఉన్న‌ప్ప‌టికి అందులో ప్ర‌ధానంగా కొన్ని ఉన్నాయి. సాధార‌ణ  ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ నవరత్నాలు పేరుతో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను అమలు చేస్తున్నారు.

 

నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా జగన్ నిబ‌ద్దత‌తో అమలు చేస్తూ వస్తున్నారు. జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌తో భారీ వ్య‌యం అవుతున్నా వాటిని మాత్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని అమ‌లు చేసే దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ జగన్ మొదట వృద్ధాప్య పింఛన్ పధకంపై సంతకం చేశారు. పింఛన్ విధానంపై సంతకం చేసిన జగన్ దానిని అమలు చేసేందుకు అడుగులు ముందుకు వేశారు. జగన్ పింఛన్ విధానం అమలు చేస్తూ వాటికి కావాల్సిన నిధులను ఏర్పాటు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వృద్ధాప్య పింఛన్ పథ‌కం ఆపకూడదు అని అధికారులతో స్పష్టం చేశారు.

 

అదే రోజున జగన్ ఉద్యోగాల విషయంలో కూడా ఓ ప్రముఖమైన మాటను వాడారు. బాబు వస్తారు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పిన టిడిపి ప్రభుత్వం బాబు వచ్చినా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలం అయ్యింది. కానీ, వైకాపా ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన రోజునే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించింది. దానికి అనుగుణంగానే ఆగస్ట్ 15 వ తేదీన 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్ ఉద్యోగాలను కల్పించింది. ఆ తరువాత ప్రభుత్వం గ్రామసచివాలయ ఉద్యోగాలను కల్పించింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఖ్యాతి కెక్కారు.

 

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా  బాధ్య‌త‌లు తీసుకొన్న అతికొద్ది రోజుల్లోనే  నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది. అందుకే అయన ప్రజల్లో హీరో అయ్యాడు. యువతకు అన్న అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధికి జగన్ కృషి చేస్తున్నారు అన్నది వాస్తవం అని చెప్పాలి. దీనికి తోడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాల్లో ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చిన ప‌థ‌కం మ‌ద్య‌పాన నిషేధం. ద‌శ‌ల వారిగా మ‌ద్య‌పాన నిషేధంకు అంకురార్ప‌ణ చేశారు. ఇక ఏపీలో పోలీసుల‌కు వీక్ ఆఫ్‌.. పెంచిన వేత‌నాలు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చాయి.

 

ఇక ఆర్టీసీని ప్ర‌భుత్వ ప‌రం చేయ‌డం, కార్మికుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తించ‌డం జ‌గ‌న్‌ను జ‌న‌హీరోగా మార్చాయి. జ‌గ‌న్‌కు బాగా పేరు తెచ్చిన ప‌థ‌కం ఆరోగ్య శ్రీ ప‌థ‌కం. ఈ ప‌థ‌కం స్వ‌ర్గీయ డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కంను జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మంగా తీసుకుని మ‌రింత వ‌న్నే తెచ్చారు. ఇది జ‌గ‌న్ ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది. వీటితో పాటు జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌తి ప‌థ‌కం అణిముత్యాలే అని చెప్ప‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: