దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ అంటారు. ఆయన రెండు సార్లు ఒంటి చేత్తో బీజేపీని అధికారంలోకి తెచ్చారు. 2014లో బీజేపీకి 282 సీట్లు తెచ్చి అప్పటికి మూడు దశాబ్దాలుగా ఉన్న సంకీర్ణ రాజకీయాలకు ముగింపు పలికింది మోడీయే. ఇక 2019 ఎన్నికల నాటికి మోడీ ఏకంగా 303 సీట్లు బీజేపీకి సాధించి కొత్త రికార్డు నెలకొల్పారు.   మోడీ ప్రపంచంలోనే గ్రేట్ లీడర్ గా ఇపుడు కనిపిస్తున్నారు.

 

అటువంటి మోడీ ఆరు నెలల పాలనను బేరీజు వేసుకున్నపుడు పెద్దగా సంత్రుప్తి కలగదు. ఓ వైపు ఆర్ధిక రంగం కుప్పకూలుతోంది. ద్రవ్యోల్బనం  బాగా పెరిగిపోతోంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసరల ధరలు పెరిగాయి. మరో వైపు చూసుకుంటే ఒక్క ఉల్లి తల్లి  సెంచరీలు కొట్టేసి  కన్నీళ్ళు పెట్టిస్తోంది.

 

నిరుద్యోగం భూతంలా పెరిగి పెద్దదవుతోంది. సామాన్యుడి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది.  దేశంలో  సంపద స్రుష్టి అన్నది లేదు, మరో వైపు అన్ని రంగాలూ తిరోగమనంలో ఉన్నాయి. ఆర్ధిక మాంద్యం పురులు విప్పుకుని విశ్వరూపమే చూపిస్తోంది.

 

ఇవన్నీ ఇలా ఉంటే పాలనాపరంగా కూడా పెద్దగా సంస్క‌రణలు ఏవీ లేవు. మోడీ రాజకీయంగా కూడా బీజేపీని గెలిపించలేకపోతున్నారు. ఆయన మ్యాజిక్ తగ్గిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ రెండవమారు అధికారంలోకి వచ్చాక  జరిగిన హర్యానా మహారాష్ట్ర ఫలితాలు చూసుకుంటే హర్యానాలో ఓడి గెలిస్తే మహారాష్ట్రలో గెలిచి ఓడింది బీజేపీ.

 

ఇక జార్ఖండ్ ఫలితం కూడా డౌట్ కొడుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కొద్ది నెలల్లో ఉన్నాయి. అక్కడ ఆప్ బలంగానే ఉంది. ఇవన్నీ చూసుకున్నపుడు మోడీ గ్రాఫ్ నెమ్మదిగా తగ్గుతోందని అంటున్నారు. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసినా అక్కడ పరిస్థితులు కుదుటపడకపోవడం కూడా ఓ వైఫల్యంగానే చూస్తున్నారు. మొత్తం మీద ఆరు నెలల్లో మెరుపులు ఏవీ లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: