హైద‌రాబాద్‌లో ఆడ‌బిడ్డ‌లపై దారుణాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. శంషాబాద్‌లో డాక్ట‌ర్ ప్రియాంక‌రెడ్డి దారుణ హ‌త్య ఘ‌ట‌న కల‌క‌లం కొన‌సాగుతుండ‌గానే...మ‌రో మ‌హిళ ఆ హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశానికి కొన్ని కిలోమీట‌ర్ల దూరంలోనే అదే రీతిలో దారుణంగా క‌న్నుమూసింది. ఈ హ‌త్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తుండ‌గానే...మ‌రో ఆడ‌బిడ్డ‌ ఇదే ప‌రిస్థితిని ఎదుర్కుంది. డ‌బ్బులు అప్పు అడిగితే ఇవ్వ‌నందుకు నిజాంపేట్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారయ‌త్నం. ఈఘ‌ట‌న‌లో విస్మ‌యక‌ర అంశం..ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి బాధితురాలి అక్కను రెండు లక్షలు ఇవ్వాలని అడిగితే ఇవ్వనందుకు సోద‌రి అయిన ఆ అభాగ్యురాలిపై అత్యాచార‌య‌త్నం చేసి ఇంట్లో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.

 

హైదరాబాద్ నిజాంపేట్ బాచుపల్లిలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఈ ఘటన జరిగింది. హారిక అనే మహిళ తన కొడుకు, చెల్లెలితో నిజాంపేట్ కాకతీయనగర్‌లో నివసిస్తోంది. హారిక స్థానిక స్కూల్‌లో టీచర్ గా పనిచేస్తుండగా.. ఆమె చెల్లెలు సాయి ప్రియ గచ్చిబౌలి లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుంది. హారిక వ్య‌క్తిగ‌త కార‌ణాల వల్ల విడాకులు తీసుకుంది. రెండో వివాహం కోసం మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా ప్రయత్నించగా జయచంద్ అనే వ్వక్తి పరిచయం అయి వివాహం చేసుకుంటానని హారికకు మాటిచ్చాడు. దీంతో ఆయ‌ హారిక ఫ్యామిలీతో స‌న్నిహితంగా మెదులుడుతున్నాడు. ఈ క్ర‌మంలో శనివారం రెండు లక్షలు కావాలని హారికను జయచంద్ అడిగాడు. అయితే, త‌న వ‌ద్ద డ‌బ్బులు లేన‌వి హారిక చెప్ప‌డంతో... జ‌యచంద్‌లోని మాన‌వ‌మృగం మేల్కొంది. నిజాంపేట్ లో నివసిస్తున్న హారిక ఇంటికి పూటుగా మందుతాగివెళ్లాడు. ఆ సమయంలో హారిక లేదు. దీంతో ఇంట్లో ఉన్న ఆమె చెల్లెలు సాయిప్రియపై అత్యాచార‌య‌త్నం చేశాడు. ఇంట్లో ఉన్న బంగారం చైన్, ఐ ఫోన్ తీసుకుని ఫ్లాట్ డోరుకు తాళం వేసి ప‌రార‌య్యాడు.

 

విధులు నిర్వ‌ర్తించుకొని వ‌చ్చిన హరిక ఫ్లాట్‌ లోపల లైట్ వెలుగుతుండటం, బైట ప్లాటుకు తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చి 100 నెంబరుకు డ‌య‌ల్ చేసి పోలీసుల‌కు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు వచ్చి తాళం విరగగొట్టి చూడగా సాయి ప్రియ అపస్మారక స్దితిలో పడివుంది. సాయి ప్రియను హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య‌సేవ‌లు అందించారు. అయితే, సంఘ‌ట‌న గురించి ఆమెను ఆరాతీయ‌గా.... తనపై అత్యాచారం జరిగిందో లేదో.. ఏమీ గుర్తులేదని చెప్పిందని పోలీసులు తెలిపారు. కాగా, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే కేసు నమోదు చేసుకుంటామని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా, న‌గ‌రంలో మ‌హిళ‌ల ప‌ట్ల జ‌రుగుతున్న దారుణ‌ల‌పై హైద‌రాబాద్ వాసులు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: