ఒక వైపు రాష్ట్రంలో ఆత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఉగ్రవాదం ఎప్పుడు పంజా విసురుతుందో తెలియని పరిస్దితులు. మనుషుల్లో ప్రేమ, భగవంతుని పట్ల భయం భక్తి తగ్గిపోతున్నాయి. ఇక మతం ముసుగులో ఇప్పటికే జరుగుతున్న నేరాలు ఘోరాలను చూస్తుంటే అసలు ఈ ప్రపంచంలో మనుషుల ఉనికి ఉండకుండా నశించిపోతే బాగుండునని కొంతమంది వేదన చెందుతున్నారు.

 

 

ఇకపోతే మా మతం గొప్పది అని గొప్పగా చెప్పుకుంటూ ప్రచారం చేసేవారు ఉన్నారు. మతం అనేది బ్రతకడానికి పుట్టింది కాని బ్రతుకును చెడపడానికి కాదూ. అందరిలో ఉన్నది ఒకటే ఆత్మ. అందరు పీల్చేది ఒకటే గాలి. మరెందుకు మతం చాటునా ఇన్ని దారుణాలు. ఇకపోతే కలియుగ వైకుంఠ వాసం అయినా తిరుమలలో కొన్ని మత శక్తులు అడ్డవేసారన్న విషయాన్ని ఎప్పటి నుండో వింటూనే ఉన్నాం అది మరో సారి రుజువైంది. అదేమంటే తితిదే కొత్తగా రూపొందించిన 2020 క్యాలెండర్‌ పీడీఎఫ్‌ను గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో అన్యమత నినాదం కనిపించడం వివాదాస్పదమైంది.

 

 

ఇప్పటికే దీనిపై భక్తుల నుంచి ఆక్షేపణలు కూడా వచ్చాయి. విషయం తెలుసుకున్న తితిదే అధికారులు శనివారం ఉదయం దాన్ని తొలగించారు. కొత్త క్యాలెండర్‌ పీడీఎఫ్‌ ప్రతిని తితిదే ఇంకా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురాలేదు. 2019 ఏప్రిల్‌ 6న అప్‌లోడ్‌ అయిన క్యాలెండర్‌ పీడీఎఫ్‌ లింక్‌ కింద ఈ అన్యమత నినాదం కన్పించింది.

 

 

ఇకపోతే ఎలక్ట్రానిక్‌ డేటా ప్రాసెసింగ్‌, టీసీఎస్‌ సంస్థలు తితిదే వెబ్సైట్‌ను నిర్వహిస్తున్నాయి. ఆంగ్ల పదాలను టైప్‌ చేసినప్పుడు తెలుగులోకి తర్జుమా చేసే సమయంలో పొరపాటు జరిగిందా? లేదా వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేశారా? అన్నది పరిశీలిస్తున్నారు. దీనిపై విచారిస్తున్నామని అదనపు ముఖ్య విజిలెన్స్‌ అధికారి శివకుమార్‌రెడ్డి తెలిపారు. ఏది ఏమైన ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మరోసారి నిర్లక్ష్యంగా వ్యహరించడం పై భక్తులు ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: