పశు వైద్యురాలు ప్రియాంకారెడ్డి అత్యాచారం , హత్యోదంతం పై దేశవ్యాప్తంగా ప్రముఖులు స్పందిస్తున్నారు . రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఇలా ఒక్కరేమిటి అన్ని వర్గాలవారు ఈ దుర్ఘటనపై తమదైన శైలిలో స్పందిస్తుంటే  , ఇంత జరిగిన  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా?, అయన ఎందుకు స్పందించారన్న   ప్రశ్న తలెత్తుతోంది .  ప్రియాంకారెడ్డి ఇంటికి తెలంగాణ గవర్నర్ తమిళిసై వెళ్లి వారి తల్లితండ్రులను పరామర్శించారు  . రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్న గవర్నర్ స్పందించినట్లుగా కూడా కేసీఆర్ స్పందించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .

 

 ప్రియాంకారెడ్డి అత్యాచారం , హత్యోదంతం పై అధికారం , విపక్షం అన్న తేడాలేకుండా ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో స్పందించగా , కేసీఆర్ ఎందుకు   సందించారన్న  ప్రశ్న కు సమాధానం లేకుండా పోయింది  . ఇదే విషయాన్ని ఒక జాతీయ ఛానెల్ చర్చాగోష్టి లో టీఆరెస్ పార్టీ కి చెందిన  చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ని ప్రశ్నిస్తే నీళ్లు నమలడం అయన వంతయింది . దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియాంకారెడ్డి అత్యచారం , హత్య ఘటన పట్ల   ఇక తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు . విద్యావంతురాలైన ప్రియాంకారెడ్డి తన సోదరికి బదులుగా , 100 ఫోన్ చేసి ఉంటే పోలీసులు కాపాడి ఉండేవారన్న మహమూద్ అలీ  వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

 

బాధితురాలిని కాపాడాల్సిన పోలీసులే అమ్మాయి అదృశ్యమైన  ప్రాంతం   తమ పరిధిలోకి   రాదంటే , తమ పరిధిలోకి రాదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే , హోంమంత్రి మాత్రం 100 కు ఫోన్ చేసి ఉంటే పోలీసులు కాపాడి ఉండేవారని బాధితురాలిని తప్పిపట్టే ప్రయత్నాన్ని చేయడం పట్ల తీవ్రంగా మండిపడుతున్నారు . అసలు పోలీసులు తమ బాధ్యతను తాము సక్రమంగా నిర్వహించి ఉంటే ఈ సంఘటన చోటు చేసుకుని ఉండేది కాదని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: