దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్య కేసు పై సామాన్య ప్రజానీకం నుంచి సెలెబ్రిటీల వరకూ అందరూ స్పందించారు. కానీ సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ఘటన పై స్పందించకపోవడం గమనార్హం. తాజాగా జాతీయ మీడియా దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు పై సీఎం స్పందించకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

 

రిపబ్లిక్ టీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే అర్నాబ్ గోస్వామి న్యూస్ డిబేట్ ఎంత ప్రసిద్దో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ షో లో ప్రియాంక రెడ్డి హత్య కేసు పై చర్చ నిర్వహించారు. దీంట్లో భాగంగా తెలంగాణ చేవెళ్ల నియోజకవర్గం ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి కూడా చర్చ లో పాల్గొన్నారు. 

 

ఎంపీ రంజిత్ రెడ్డి ని అర్నాబ్ గోస్వామి "మీ రాష్ట్రంలో ఒక 26 ఏళ్ళ యువతిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు, మీ సీఎం ఈ ఘటన పై అందుకు స్పందించలేదు, అసలు మీ సీఎం ఏం చేస్తున్నారు, తెలంగాణలోనే ఉన్నారా, ఉంటే నిద్రపోతున్నారా, అంతా తీరిక లేని పని ఏం చేస్తున్నారు మీ సీఎం" అని ప్రశ్నల వర్షం కురిపించారు. రంజిత్ రెడ్డి ఏదో చెప్పే ప్రయత్నం చేయగా అడ్డుకున్న అర్నాబ్ గోస్వామి తన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. నన్ను షో కు ఈ ప్రశ్న అడగడానికి పిలిచారా?  అంటూ రంజిత్ రెడ్డి అనగా "మీ హోమ్ మంత్రి బాధితురాలు ఇంటికి వెళ్లి, బాధితురాలు చెల్లికి ఎలా ఫోన్ చేస్తుంది 100 కి ఫోన్ చేయాల్సింది, బాధితురాలు తప్పు చేసింది అని అన్నారు, ఒక డాక్టరేట్ ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి" అంటూ ప్రశ్నించారు అర్నాబ్ దీనికి సమాధానం గా "హోమ్ మంత్రి అలా మాట్లాడారు అని నాకు తెలీదు" అంటూ రంజిత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అంటే మీరు అధికారంలో ఉన్నారు కనుక ఏం మాట్లాడిన ఊరుకుంటాం అనుకుంటున్నారా అని అర్నాబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

సీఎం కెసిఆర్ ఈ ఘటన పై ఎందుకు స్పందించలేదో చెప్పండి అని అర్నాబ్ కోరగా, సీఎం ను విమర్శించడం తగదు అని రంజిత్ పేర్కొనగా "బాధిత కుటుంబానికి మేము వున్నాం అని భరోసా కల్పించాల్సిన అవసరం లేదా, బాధిత కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత లేదా మీ సీఎం కు, మీ సీఎం ను చూస్తుంటే సిగ్గేస్తుంది, మీ లాంటి రాజకీయ నాయకులను చూస్తుంటే అసహ్యం వేస్తోంది" అని అర్నాబ్ అన్నారు దీనితొ ఏం చెప్పాలో అర్ధం కాక రంజిత్ రెడ్డి తెల్ల మొహం వేశారు. ఇక అర్నాబ్ అడిగిన ప్రశ్నలకు నెటిజన్స్ జేజేలు కొడుతున్నారు. ప్రతిపక్షం చేయలేని పని కనీసం మీరైన చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: