ప్రియాంక రెడ్డి అత్యచారం, హత్య తరువాత వారి ఇంటికి వచ్చే వారిసంఖ్య  పెరిగిపోయింది.  షాద్ నగర్ లోని నక్షత్ర కాలనీకి సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులు, పోలీస్, మీడియా వారి తాకిడి ఎక్కువైంది.  వచ్చిన వాళ్ళు వస్తున్నారు.. పరామర్శిస్తున్నారు వెళ్లిపోతున్నారు.. అంతకు మించి మరెలాంటి చర్యలు తీసుకోవడం లేదు.  నిందితులను పోలీసులు పట్టుకున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జైలుకు తరలించారు.  
దీంతో ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులు, కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రజలంతా నిన్నటి రోజున షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర అంతసేపు వెయిట్ చేస్తే.. నిందితులను 14 రోజులపాటు రిమాండ్ అని చెప్పి వాళ్ళను అంత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు తరలించడం మహానేరం అని.. పాపం చేసిన వ్యక్తును వెంటనే ఉరితీయాలని లేదంటే ప్రజలకు అప్పగించాలని కోరినప్పటికీ వారిని రాచమర్యాదలతో జైలుకు తీసుకెళ్లారని ఆవేదన చెందుతున్నారు.  
అన్ని ఎవిడెన్స్ లు ఉన్నప్పటికీ..ఇలా చేయడం తగదని వారిని జైలుకు పంపి అక్కడ వారికీ మర్యాదలు చేస్తూ కూర్చుంటే మాకు న్యాయం ఎవరు చేస్తారని తల్లిదండ్రులు అంటున్నారు.  తమకు ఎలాంటి న్యాయం జరగదు అని ఇప్పటికే తేలిపోయిందని, ఇకపై ఎవరూ కూడా తమ ఇంటికి రావల్సిన అవసరం లేదని, మీడియాకు, పోలీసులకు, రాజకీయ నాయకులు ఎవరూ మా ఇంటివైపు రావొద్దని ఆ ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులు అంటున్నారు.  
ఎన్ని చట్టాలు వచ్చినా ఆడపిల్లకు న్యాయం జరగదని అర్ధం అయ్యిందని ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇక నక్షత్ర కాలనీ వాసులు కాలనీ గేట్ ను క్లోజ్ చేసి తాళం వేశారు.  బయట వ్యక్తులు ఎవర్ని లోనికి అనుమతించడం లేదు.  ఎవరూ వచ్చినా బయటనుంచే వెళ్లిపోవాలని అంటున్నారు.  తమకు న్యాయం జరిగే వరకు ఎవరూ లోపలి రాకూడదని చెప్తున్నారు.  మమల్ని ఇలా వదిలేయండి అని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: