ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు . ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన ఘటనగా ఆయన అభివర్ణించారు . హైదరాబాద్ లో ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటన్నా  కోహ్లీ , మనం బాధ్యత తీసుకుని ఇలాంటి అమానవీయ ఘటనలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు . కోహ్లీ ఒక్కడే కాకుండా పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రియాంకారెడ్డి హత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ ఆవేదనను పంచుకున్నారు .

 

 సురక్షిత నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకోవడం వల్ల, ఎవర్ని తప్పు పెట్టాలో తెలియడం లేదని   హీరోయిన్ కీర్తి సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు . స్త్రీలు ఏ సమయంలోనైనా నిర్భయంగా తిరిగే దేశంగా మన దేశం ఎప్పుడు మారుతుందోనన్న ఆమె, ప్రియాంక హంతకులను వేటాడి శిక్ష పడేవిధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు . నటుడు విజయ్ అభిమానులు ప్రియాంక హత్యాచార ఘటనపై పోరాటానికి నడుం బిగించారు . వియ్ డిమాండ్ జస్టిస్ ఫర్ అవర్ సిస్టర్ పేరిట ట్యాగ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ ట్యాగ్ సోషల్ మీడియా లో ట్రేండింగ్ గా మారింది .

 

  ఇక ప్రియాంకారెడ్డి తల్లితండ్రులు రాజకీయ నాయకులు , మీడియా ప్రతినిధులు , పోలీసులు తమ ఇంటికి రావద్దని పేర్కొన్నారు . తమకు సానుభూతి అవసరం లేదని , న్యాయం కావాలని డిమాండ్ చేశారు . సరైన సమయం లో పోలీసులు స్పందించి ఉంటే ప్రియాంక తమకు దక్కి ఉండేదని చెప్పారు . ఆపద లో ఆదుకోవాల్సిన పోలీసులు, తమ కూతురు దూరమయ్యాక తమ ఇంటి చుటూ తిరగడం ఎందుకనీ ప్రశ్నించారు .  ఈ ఘటన పై ప్రధాని , ముఖ్యమంత్రి కేసీఆర్ లు స్పందించాలని ప్రియాంకారెడ్డి తల్లితండ్రులు డిమాండ్ చేశారు . ఇక సానుభూతి పరామర్శలతో విసిగిపోయామన్న వారు , ప్రియాంకారెడ్డి కి న్యాయం చేయాలని నినదించిన వారిపై లాఠీఛార్జ్ చేస్తారా అంటూ నిలదీశారు .   

మరింత సమాచారం తెలుసుకోండి: