వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డిని నలుగురు పోకిరీలు దారుణంగా అత్యాచారం చేసి, దహనం చేసిన విషయం తెలిసిందే. ప్రియాంక అంత్యక్రియల విషయంపై ఆమె బంధువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ పలు విషయాల‌ను వెల్ల‌డించారు. పెళ్లి కాని వారు చనిపోతే తమ కులంలో దహన సంస్కారాలకు ముందు చెట్టుతో వివాహం జరిపించడం తమ ఆచారమని, కానీ, ప్రియాంక పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో జరిపించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

 

దేశంలో మహిళల రక్షణకు కఠినతర చట్టాలు తెచ్చినప్పటికీ వాటిని నిరోధించలేకపోతున్నారని అన్నారు. ఈ లోపాలను సరిచేసి, దేశంలో అమ్మాయిలకు భద్రత ఉంటుందని తెలిసేలా చేయాలని ఆయన కోరారు. ప్రియాంక రెడ్డి ఘటనపై సీఎం కేసీఆర్ ఇప్పటికీ స్పందించలేదని, తాపం కూడా తెలియజేయలేదని ఆయన వాపోయారు. ప్రియాంకకు జంతువులంటే చాలా ఇష్టమని, అందుకే  వెటర్నరీ వైద్యురాలయిందని చెప్పారు. ఆమెకు ఆన్‌లైన్‌లో  కొత్త వంటకాలను చేయడం  వంటి అలవాట్లు కూడా ఉన్నాయని తెలిపారు.

 

ప్రియాంక మొబైల్ ద్వారా ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్ చిక్కాడు. టైర్ పంక్చర్ చేయించు వస్తామన్న సమయంలో ప్రియాంక మొబైల్ నెంబర్ మహ్మద్ ఆరిఫ్ తీసుకున్నాడు. పావుగంట దాటినా రాకపోవడంతో మహ్మద్‌కు ప్రియాంక ఫోన్ చేసింది. బాధితురాలితో నిందితులు బలవంతంగా మద్యం తాగించారు. రాత్రి 9.30 నుంచి 10.20 వరకు బాధితురాలిపై నిరంతరాయంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముక్కు, నోరు మూయడంతో ప్రియాంక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హెల్ప్.. హెల్ప్ అని వేడుకున్నా కిరాతకులు కనికరించలేదు. బాధితురాలి ప్యాంట్ లేకుండానే మృతదేహాన్ని లారీలోకి ఎక్కించారు. మళ్లీ కిందికి వెళ్లి ప్యాంట్ తీసుకువచ్చారు కిరాతకులు. 

 

లారీలో మృతదేహం పై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు. లారీలో ప్రియాంక రక్తపు మరకలు, వెంట్రుకలను క్లూస్ టీమ్ సేకరించింది. అంతేకాక మనుషులు తిరిగే చోటులో ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరిగితే ఇక ఆడపిల్లకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా. ఇలాంటి కేసుల విషయంలో జడ్జీలు నడిరోడ్డుపై నేరస్థుల్ని ఉరితీసే విధంగా జడ్జ్‌మెంట్‌లు ఇవ్వాలన్నారు. అభం శుభం తెలియని అమ్మాయిని అన్యాయంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మానవ మృగాల్ని బహిరంగంగానే ఉరితీయాలని డిమాండ్ చేశారు రోజా.

మరింత సమాచారం తెలుసుకోండి: