ప్రస్తుతం రోజురోజుకు ప్లాస్టిక్ భూతం ఈ భూమిపై అతి పెద్ద మహమ్మారిగా మారి ఎన్నో మూగజీవాల మరణానికి కారణం అవడంతో పాటు, పర్యావరణ కాలుష్యానికి అతి పెద్ద పెను ముప్పుగా మారింది. కాగా ఇప్పటికే పలు దేశాలు ప్లాస్టిక్ భూతం పై యుద్ధం మొదలెట్టి, తమ తమ దేశాల్లో ప్లాస్టిక్ ని చాలావరకు నిషేదించేలా ఆజ్ఞలు జారీ చేసాయి కూడా. ఇక మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్లాస్టిక్ వినియోగంపై కఠినమైన నిర్ణయాలు తీసుకుని, దానిని నిషేధించడం జరిగింది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మెల్లగా ప్లాస్టిక్ ని నిషేధించే ఉద్యమం ఊపందుకుంటోంది. 

 

ఇప్పటికే కొన్ని ప్రాంతాల ప్రజలు స్వచ్చందంగా ప్లాస్టిక్ బ్యాగులు మరియు పలు వస్తువులను పూర్తిగా నిషేధించి వాటి స్థానంలో పేపర్ మరియు జ్యూట్ తో చేసిన బ్యాగుల వంటి వాటిని వాడుతూ తమ వంతుగా పర్యావరణానికి ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా మునిసిపాలిటీ కూడా ఈ ప్లాస్టిక్ భూతంపై యుద్ధం ప్రకటించింది. అలానే ప్లాస్టిక్ వినియోగాన్ని మెల్లగా తగ్గించేందుకు ప్రజల వద్దకు పలు పధకాలు ప్రవేశపెట్టి వారిలో చైతన్యాన్ని తీసురావడానికి నిన్నటినుండి ఒక సరికొత్త పద్దతిని అమలు చేస్తున్నాయి. అదేమిటంటే, ఎవరైనా కేజీ ప్లాస్టిక్ వస్తువులు తీసుకుని వస్తే, 

 

వాటికి బదులుగా ఆరు కోడిగుడ్లు లేదా ఒక పావు కిలో మిఠాయిని అందించేలా ఒక వినూత్న పద్దతిని ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక నిన్న అధికారికంగా ఆ జిల్లాలో ప్రవేశపెట్టబడిన ఈ పధకానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తోందని, ఇక నిన్న ఒక్కరోజే 498 కేజీల ప్లాస్టిక్ ని ప్రజల నుండి సేకరించామని మునిసిపల్ అధికారులు తెలిపారు. ఇక నేటి నుండి ఈ పథకానికి మరింత ప్రజాధరణ లభిస్తుందని ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. కాగా ఇటువంటి పధకాలు ఇతర జిల్లాల్లో కూడా ప్రవేశ పెడితే ప్లాస్టిక్ భూతాన్ని అతి త్వరలో పూర్తిగా అంతమొందించొచ్చని పలువురు ప్రజలు కోరుతున్నారు. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: