హైద‌రాబాద్ శంషాబాద్ ఏరియాలో జ‌రిగిన ప్రియాంక ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆమెను రేప్ చేసిపంప‌డ‌మే కాకుండా పెట్ర‌ల్‌పోసి సంజీవంగా ద‌హ‌నం చేశారు. ఈ దారుణం ప్ర‌తి ఒక్క‌రి గుండెల‌ను పిండేసింది. దోషులు ఎవ‌రైతే ఉన్నారో వాళ్ళ‌ని కఠినంగా శిక్షించాలంటూ అంద‌రూ నినాదాలు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న పై ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు కూడా స్పందిస్తున్నారు. ప్రియాంక‌కు జ‌రిగిన అన్యాయం పై న్యాయం జ‌ర‌గాలంటూ అంద‌రూ కోరుతున్నారు. న్యాయం జ‌ర‌గాలంటూ  సోష‌ల్ మీడియాలో స్పందిస్తున్నారు.

 


ఈ ఘ‌ట‌న పై మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కూడా ట్విట్ట‌ర్‌ను వేదిక‌గా చేసుకుని స్పందించారు. ఆమెకు న్యాయం జ‌ర‌గాలంటూ కోరారు. డాక్ట‌ర్ ప్రియాంక వార్త విని చాలా బాధ‌ప‌డ్డాను. దోషులను చట్టం అత్యంత క్రూరంగా శిక్షిస్తుందని ఆశిస్తున్నాను. ఇలాంటివి చేయడానికి ఎవరైనా భయపడేలా ఆ శిక్ష ఉండాలి. జస్టిస్ ఫర్ ప్రియాంక రెడ్డి’’ అని వరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే మాస్ మ‌హారాజా ర‌వి తేజ కూడా ఈ ఘ‌ట‌న పై స్పందించారు. ‘‘ప్రియాంక హత్య వార్తను విన్న తరవాత ఈ బాధను ఎలా వర్ణించాలో తెలియడంలేదు. చట్టాలు, పోలీసులు ఉన్నది నేరాలను అదుపు చేయడానికి, కానీ జంతువులను కాదు. ఇలాంటి తప్పులు చేస్తే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో తెలియజెప్పే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి’’ అని పేర్కొన్నారు.  ‘‘చాలా బాధగా ఉంది.  మ‌నుషులు ఇంత క్రూరంగా మారుతున్నారేంటి. ఇలా జరగకూడదు. ప్ర‌స్తుతం ఇక్క‌డ జ‌రిగిన ఈ  ఘటన గురించి మనకు తెలిసింది, మనకు తెలియని ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరుగుతున్నాయో ఊహించండి. మహిళలైనా, పురుషులైనా ప్రతి ఒక్కరికీ కనీస మర్యాద ఇవ్వాలి. ఇలాంటి మగాళ్లను కఠినంగా శిక్షించాలి. ప్రియాంక రెడ్డికి న్యాయం జరగాలి’’ అని హీరోయిన్ నిధి అగర్వాల్ ట్వీట్ చేశారు.  

 

సూప‌ర్ హిట్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ఈ విధంగా స్పందించారు. ‘ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రియాంక రెడ్డిని అత్యంత క్రూరంగా రేప్ చేసి చంపేశారని తెలిసి షాకయ్యా. ఆ నలుగురు దోషులను పోలీసులు, చట్టాలు వెంటనే శిక్షిస్తాయని ఆశిస్తున్నా. ఈ జంతువులను ఒక ఉదాహరణ చేద్దాం. మన దేశంలో మరో కూతురు ఇలాంటి క్షోభను అనుభవించకూడదు’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: