రాధారవి...త‌మిళ‌నాడుకు చెందిన న‌టుడు. ఐశ్వర్యరాయ్, నయనతారలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అప్పట్లో  వార్తల్లో నిలిచారు. అంతేకాకుండా కోలీవుడ్‌లో మీటూకు ప్రాబల్యం తీసుకొచ్చింది చిన్మయితో కూడా వివాదం పెట్టుకున్నారు.అంతేకాకుండా ఆయ‌న రాజ‌కీయాల్లో కూడా చురుగ్గానే వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే, ఎక్క‌డా స్థిరంగా ఉండ‌ర‌నే పేరుంది. ఎందుకంటే...2000 వ సంవత్సరంలో డీఎంకేలో చేరిన ఆయన అనంత‌రం అన్నాడీఎంకేలో చేరారు. మళ్లీ డీఎంకేలోకి జంప్ అయ్యారు. ఈ ఏడాది మార్చిలో వివాదం కార‌ణంగా వేటు వేయడంతో మళ్లీ.. అన్నాడీఎంకేలోకి వెళ్లారు. తాజాగా ఆయ‌న బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. చెన్నైకి వచ్చిన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సినీ నటులు నమిత, రాధారవి బీజేపీలో చేరారు. రాధారవికి బీజేపీ నేత, సినీ నటుడు ఎస్వీ శేఖర్‌ అభినందనలు తెలియజేశారు.

 

కాగా, రాధార‌వి జంపింగ్‌పై సినీ నేపథ్య గాయని చిన్మయి మాత్రం తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలను కించ పరిచే రీతిలో స్పందించే రాధారవిని పార్టీలో చేర్చుకోవడంతో నష్టం తప్పదని అన్నారు. చిన్మ‌యికి రాధార‌వికి మ‌ధ్య భారీ వివాదం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. `మీటూ` వివాదం స‌మ‌యంలో...చిన్మ‌యిని డబ్బింగ్‌ కళాకారుల సంఘం నుంచి తొలగించారు. అందుకు చిన్మయి రెండేళ్లుగా సంఘ వార్షిక సభ్యత్వ రుసుంను చెల్లించలేదన్నది సాకుగా చూపారు. అందుకు చిన్మయి ఘాటుగానే స్పందించారు. మీటూ ఆరోపణ కారణంగానే రాధారవి తనను సంఘం నుంచి తొలగించారని, అయినా తన సభ్యత్వాన్ని రద్దు చేయడం ఆయనకు సాధ్యం కాదని, తాను శాశ్వత సభ్యురాలినని పేర్కొన్నారు. తాజాగా రాధారవికి మరో షాక్‌ ఇచ్చారు. రాధారవికి మలేషియా ప్రభుత్వం డటోక్‌ అనే ఆ దేశ ప్రతిష్టాత్మకమైన బిరుదుతో సత్కరించిందట. దీంతో ఆయన పేరు ముందు డటోక్‌ అపే బిరుదును తగిలించుకున్నారు. ఈ బిరుదు వెనుక గుట్టును గాయని చిన్మయి బయట పెట్టారు. ఈ బిరుదుపై మలేషియా ప్రభుత్వానికి చిన్మయి లేఖ రాసి నిజానిజాలు తెలిపాల్సిందిగా కోరారు. చిన్మయి లేఖకు స్పందించిన ఆ దేశ ప్రభుత్వం రాధారవికి తమ ప్రభుత్వం డటోక్‌ బిరుదును అందించిన దాఖలాలు లేవని, అసలు భారతదేశానికి సంబంధించి ఒక్క నటుడు షారూక్‌ఖాన్‌కు మినహా మరెవరికీ ఆ బిరుదును అందించలేదనిపేర్కొంది. ఈ విషయాన్ని గాయని చిన్మయి శనివారం తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి రాధారవి డటోక్‌ పట్టం నకిలీ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: