అసలే రోజుకు బాగా లేవు. ఇప్పుడు ఎవరైన పిచ్చిపిచ్చి పనులను చేసారంటే వారి తాట తీయడానికి సిద్దంగా ఉన్నారు పోలీసులు. ఇకపోతే టెక్నాలజీ పెరిగినాకా నేరాలు కూడా ఎక్కువైయ్యాయి. ఫేస్ బుక్ ప్రేమలు. టిక్ టాక్ ప్రేమలు అని ఇప్పటికే అమ్మాయిలు, అబ్బాయిలు లోకంలో ఆగడం లేదు. పోనీ వారు ప్రేమించుకుని ఆనందంగా ఉంటారా అంటే అదీ లేదు.

 

 

తమ అవసరాలు తీర్చుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇకపోతే వీరపాండి సమీపంలో వివాహానికి అంగీకరించని ఫేస్‌బుక్‌ ప్రేమికుడిని హతమార్చడానికి మలేషియా మహిళ పంపిన కూలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విచిత్ర ప్రేమ గాధను తెలుసుకుంటే తేని జిల్లా వీరపాండి సమీపంలో ఉన్న కాట్టునాయక్కన్‌ పట్టికి చెందిన అశోక్‌ కుమార్‌ (28) కు ఫేస్‌బుక్‌ ద్వారా మలేషియాకు చెందిన అముదేశ్వరి పరిచయమైంది. ఆ పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారింది. తరువాత అభిప్రాయ బేధాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఈ స్థితిలో మలేషియా నుంచి కవితా అరుణాచలం అనే మహిళ, అశోక్‌కుమార్‌ సెల్‌కి కాల్‌ చేసి తను అముదేశ్వరి అక్క అని, వివాహం చేసుకోకపోవడం వల్ల అముదేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించింది.

 

 

అంతటితో ఊరుకోకుండా మలేషియా నుంచి తమిళనాడు వచ్చిన కవితా అరుణాచలం... అక్టోబర్‌ 30న అశోక్‌ కుమార్‌ను కలిసి తనను వివాహం చేసుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అశోక్‌కుమార్‌ దీనిపై తేని పోలీసులకి సమాచారం అందించాడు. పోలీసులు ఆ మహిళ గురించి విచారించగా 45 ఏళ్లు గల ఆ మహిళ, అముదేశ్వరి, కవితా అరుణాచలం అనే పేరుతో అశోక్‌కుమార్‌తో మాట్లాడినట్లు తెలిసింది. అసలు నిజం బయట పడగా పోలీసులు ఆమెని హెచ్చరించి పంపారు.

 

 

దీన్ని మనసులో పెట్టుకుని తనను వివాహం చేసుకోకుండా మోసం చేసిన అశోక్‌కుమార్‌ని చంపటానికి ప్లాన్ వేసి అందుకు గాను 9 మంది కూలీ ముఠాను పంపింది. వారు శుక్రవారం బోడి సమీపంలో ఉన్న ప్రైవేట్‌ లాడ్జీలో ఉండగా వారి ప్రవర్తన మీద అనుమానం చెందిన లాడ్జీ కార్మికులు బోడి టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేయగా వారంతా అశోక్‌కుమార్‌ని హత్య చెయ్యడానికి విఘ్నేశ్వరి పంపించిన ముఠ అని తెలిసింది. వారిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి కారు, కత్తి వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే పరారిలో ఉన్న విఘ్నేశ్వరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: