అమెరికాలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. అమెరికాలోని పిలాటస్ పీసీ-12 రకానికి చెందిన ఈ విమానం కుప్పకూలిపోయింది. సౌత్ డకోటాలోని చెంబర్లీన్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. దుర్ఘటన జరిగిన సమయంలో విమానంలో 12 మంది ఉండగా.. ఇద్దరు చిన్నారులతో సహా తొమ్మిది మంది మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న నేషనల్‌ ట్రాన్స్ పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌ బృందం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. 

 

 

విమానం చెంబర్లిన్ ఎయిర్ పోర్టు నుంచి గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం అక్కడ మంచు తుఫాను ఏర్పడటమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిజానికి ఇక్కడి ఉత్తర మైదాన ప్రాంతంలోని దక్షిణ డకోటాలో క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలియజేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ మంచు తుఫాను ఉంటుందని, దట్టమైన మంచు పేరుకుపోయి ఏం కనపబడని స్థితి ఏర్పడుతుందని జాతీయ వాతవరణ విభాగం హెచ్చరికలు జారీచేసింది.

 

 

అమెరికాలో తీవ్ర మంచు తుఫాను కారణంగా తరుచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్టోబరు నెలలో రెండో ప్రపంచ యుద్ధం నాటి విమాన కుప్పకూలింది. బ్రాడ్లీ ఎయిర్‌పోర్టులో 80 ఏళ్ల నాటి యుద్ధం విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు సహా మొత్తం ఏడుగురు చనిపోయారు. జులైలో టెక్సాస్ లో జరిగిన విమాన ప్రమాదంలో పదిమంది మరణించారు. టెక్సాస్ మున్సిపల్ విమానాశ్రయం నుంచి బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 350 ప్రైవేటు విమానం టేకాఫ్ అవుతూ హ్యాంగర్ ఢీకొట్టిన ప్రమాదంలో పదిమంది సజీవ దహనమయ్యారు. దీంతో విమాన ప్రమాదాలు పెరిగి కొంత ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: