టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం ఇటీవల తనకు హార్ట్ సర్జరీ తరువాత పెద్దగా సినిమాలు చేయడం లేదు అనే విషయం తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆయనకు హఠాత్తుగా ఉండే నొప్పి రావడంతో ముంబై లోని ఏషియన్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స నిర్వహించారు. కాగా చికిత్స అనంతరం ఎక్కువ శాతం ఇంటివద్దనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్న బ్రహ్మానందం సినిమాలు చాలా వరకు తగ్గించారు. ఇటీవల వరుణ్ తేజ్ మరియు హరీష్ శంకర్గద్దలకొండ గణేష్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసిన బ్రహ్మానందం, 

 

అతి త్వరలో కృష్ణ వంశి తెరకెక్కించబోయే రంగమార్తాండ అనే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేయడానికి సిద్ధం అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం ఆయన కర్ణాటక ఎన్నికల్లో బిజెపి పార్టీ తరపున ప్రచారం చేయడానికి సిద్ధం అయ్యారు. ఈనెల 5వ తేదీన కర్ణాటకలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో బిజెపి తరపున ప్రచారానికి బ్రహ్మానందం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా నేడు ఆయన చిక్ బల్లాపూర్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి సుధాకర్ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ఆయనను తమ అమూల్యమైన ఓటుతో గెలిపించామని బ్రహ్మానందం అక్కడి ప్రజలను అభ్యర్ధించడం జరిగింది. 

 

ఇక బ్రహ్మానందం విచేయడంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి ప్రజలు బాగా తరలి వచ్చారు. కాగా అక్కడి తెలుగు వారి కోసం తెలుగులో పలు సినిమా డైలాగులు చెప్పడం, మరియు తన కామెడీ డైలాగ్స్ తో బ్రహ్మానందం అందరినీ అలరించడం జరిగింది. బ్రహ్మానందం మాట్లాడుతూ, తన సుధాకర్ గారు మంచి మిత్రుడని, కావున ఆయన కోసం చిక్ బల్లాపూర్ వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నానని అన్నారు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. కాగా బ్రహ్మి అక్కడ ప్రచారం నిర్వహించడం బీజేపీ నేతలకు కొంత కలిసి వచ్చే అంశం అని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: