ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నికల హామీలు ముఖ్యమైన మద్యపాన నిషేధం గురించి కూడా ఆయన చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న వైన్ షాప్ స్థానంలో గవర్నమెంట్ మద్యం దుకాణాలు తెరిచింది. అందులో ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మందు దొరికే లాగా చేశారు.

 

 అలాగే మద్యం ధరలను కూడా పెంచారు తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బార్లను కూడా క్యాన్సిల్ చేశారు. దీనిపై కొత్తగా నిర్ణయం తీసుకుంటారు. కానీ, జగన్ ప్రభుత్వం ఆశిస్తున్న మద్య పాన నిషేధాన్ని తెలంగాణ వల్ల కొద్దిగా దెబ్బ తింటుంది అని చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ లో మద్యం ధరలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన మధ్య మద్యం ఆంధ్రప్రదేశ్లో దొరకడం లేదు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దుల్లో

 

ఏపీలో మద్యం ధరలు పెరగడం వలన మధ్య తరగతి వారికి ఇది చాలా భారంగా మారింది. కానీ ఎంత ధరకైనా కొనడానికి వెనుకాడని రోజువారి కూలీలు మొత్తం సంపాదన అంతా మద్యానికి ఖర్చుపెడుతున్నారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న వైన్ షాప్ లో నుంచి ఏపీ ప్రజలు మద్యం కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొని వస్తున్నారు.

 

సరిహద్దు గ్రామాలకు తెలంగాణ మద్యం చాలా పెద్ద మొత్తంలో సరఫరా అవుతోంది. ఇప్పటికే, గుంటూరు జిల్లాలో ఏకంగా 60 కేసులు నమోదయ్యాయి.గుంటూరు జిల్లాలోని పల్నాడు వాసులు ఎక్కువగా మద్యాన్ని తెలంగాణ నుంచి పల్నాడుకు తరలిస్తున్నారు. అటు ఖమ్మం నుంచి మహబూబ్ నగర్ వరకూ తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లో ఏపికి మద్యం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: