దేశం యావత్తు ప్రియాంకారెడ్డి హత్య కేసు విషయంలో స్పందించాయి. అందరూ ఇది ఘోరమైనదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామాంధుల చేతులలో ఒక అమాయకురాలు బలి అయిందని కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిజంగా ఈ దేశంలో ఆడపిల్లగా ఎందుకు పుట్టామని మహిళలు రోదిస్తున్నారు. ఆడపిల్లలను కన్నందుకు కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. మరి ఇంతటి మారణ హోమం హైదరాబాద్ లో జరిగింది. అది కూడా అంతర్జాతీయ నగరమని ఒకటికి పదిమార్లు గులాబీబాస్ చెప్పుకుంటున్న చోట జరిగింది.

 

మరి ఈ ఘోరం జరిగి ఇప్పటికి నాలుగు రోజులైంది కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ కనీసం స్పందించలేదు. ఆయన అయ్యో  ఆడకూతురుకి ఇలా జరిగిందని విచారం వ్యక్తం చేయలేదు. ఎందువల్ల అని తెలంగాణా కాంగ్రెస్  ఎంపీ రేవంత్  రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఇది బాధాకరమైన సంఘటన. ఎవరూ కూడా ఆ బాధితురాలి కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఏమీ చేయలేరు.

 

కానీ కనీసం ప్రభుత్వ పెద్దగా, రాష్ట్రానికి ఒక తండ్రిగా కేసీయార్ ఇంతవరకూ స్పందించకపోవడం దారుణ‌మేనని రేవంత్  రెడ్డి అంటున్నారు. దీని మీద రేవంత్ రెడ్డి గట్టిగానే తగులుకున్నారు కేసీయార్ స్పందించక పోవడం కంటే దుర్మార్గం ఇంకొకటి లేనేలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణా   ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిచడంలో  ఘోరంగా విఫలం అయిందని ఆయన అన్నారు.

 

మీ షీ టీమ్స్  ఏమయ్యాయి, మీ ప్రత్యేక బ్రుందాలు  ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా పోలీసులను ఎంతసేపు రాజకీయ నాయకుల మీదకు నిఘా పెట్టడానికే వాడుకుంటునారు తప్ప ప్రజల భద్రతని గాలికి వదిలేశారని కూడా రేవంత్ రెడ్డి కేసీయార్ మీద ద్వజమెత్తారు. ఇదిలా ఉండగా డీజీపీ మహేంద్రర్ రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కూడా రేవంత్  రెడ్డి  డిమాండ్  చేశారు. ఇప్పటివరకూ ఘటనా స్థలానికి డీజీపీ వెళ్ళకపోవడం దారుణమని కూడా ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: