అధికారం చూసుకుంటే రాజకీయ భవిష్యత్తే అడ్రెస్ లేకుండా పోతుందనే దానికి ఉప్పులేటి కల్పన, జలీల్ ఖాన్ ల తాజా పరిస్థితే ఉదాహరణగా నిలుస్తుంది. అధికారం కోసం ఆశ పడి ఎటు కాకుండా అయిపోయారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి రాజకీయ భవిష్యత్తునే శూన్యం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో ఈ ఇద్దరు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. కల్పన పామర్రు నుంచి గెలిస్తే....జలీల్ ఖాన్ విజయవాడ వెస్ట్ నుంచి గెలిచారు. అయితే వైసీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో అధికారంలో ఉన్న టీడీపీ వైపు వెళ్ళిపోయారు.

 

అయితే టీడీపీలోకి వెళ్ళిన సెట్ అయ్యారంటే అది లేదు. చాలారోజులు వీరిని టీడీపీ కేడర్ అంగీకరించలేదు. ఎలాగోలా అడ్జస్ట్ అయి ఎన్నికల వరకు నెట్టుకొచ్చారు. ఇక ఎన్నికల్లో కల్పన పామర్రు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు విజయవాడ వెస్ట్ లో జలీల్ ఖాన్ తన కూతురు షబానాని బరిలోకి దించారు. ఇక ఆమె కూడా ఓటమి పాలైంది. ఓడిపోవడమే ఆమె అమెరికాకు వెళ్లిపోయింది. కూతురు అటు వెళ్లడమే జలీల్ టీడీపీలో యాక్టివ్ ఉండటం తగ్గించేశారు.

 

అయితే టీడీపీ మీద వ్యతిరేకితతో పాటు...టీడీపీ కేడర్ సహకరించడం పోవడం వల్ల ఈ ఇద్దరు ఓటమి పాలయ్యారు. ఇక ఓడిపోయాక వీరిని టీడీపీ కేడర్ మరింత వ్యతిరేకిస్తుంది. వీరు పార్టీ బలోపేతం కోసం ఏ మాత్రం కష్టపడటం లేదని ఫైర్ అవుతున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండటంతో ఇప్పుడు ఈ ఇద్దరు వైసీపీ వైపుకు వెళ్ళడం కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే 2014లో వైసీపీ తరుపున గెలిచి తనని మోసం చేశారని జగన్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్ద‌రికి ఇప్ప‌టికే జ‌గ‌న్ నో చెప్పేశార‌ని కూడా వైసీపీలో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

 

ఆల్రెడీ జలీల్ వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్న అవి ఫలించేలా కనిపించడం లేదు. అలా అని టీడీపీలో ఉండాలన్న కష్టంగానే ఉంది. ఇటు కల్పనకు టీడీపీ కేడర్ చాలావరకు దూరమైపోయింది. పైగా భవిష్యత్తులో టీడీపీ నుంచి టికెట్ దక్కడం కష్టంగానే కనిపిస్తుంది. అసలు వీరు పార్టీ మారకుండా వైసీపీలో ఉండుంటే పరిస్తితి వేరేగా ఉండేది. కానీ ఇప్పుడు టీడీపీలో ఉండటం వల్ల ఎటు కాకుండా అయిపోయారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: