చేతులు, కాళ్లు లేకపోతే సగం జీవితం కోల్పోయినట్లే అని చాలామంది భావిస్తారు. కానీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. ఇందుకు ఛత్తీస్ గడ్ లోని అశీష్ నిదర్శనం. పుట్టుకతోనే అశీష్ కు కాళ్లూచేతులు లేవు. కానీ చిన్నతనం నుండి అశీష్ చక్కగా చదువుకున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆ కష్టాలను ఎదుర్కొని తన కుటుంబానికి అండగా నిలిచాడు. 
 
ఛత్తీస్ గడ్ లోని బలారామ్ పూర్ కు చెందిన అశీష్ కు శంకర్ గఢ్ పంచాయతీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం వచ్చింది. అశీష్ కాళ్లూచేతులు లేకపోయినా తన విధుల్ని చక్కగా నిర్వహిస్తున్నాడు. చాలా సులభంగా కంప్యూటర్ ను అశీష్ ఆపరేట్ చేస్తున్నాడు. కాళ్లు చేతులు సక్రమంగా ఉన్నవారు ఏ పనులు చేస్తారో ఆ పనులు అన్నీ అశీష్ చక్కగా చేస్తున్నాడు. నెలకు 10 వేల రూపాయలు సంపాదిస్తూ అశీష్ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 
 
అశీష్ ఎవరి సహాయం లేకుండా మొబైల్ ను ఆపరేట్ చేయడంతో పాటు స్కూటీని కూడా చక్కగా నడపగలడు. బలరామ్ పూర్ జిల్లా కలెక్టర్ సంజీవ్ కుమార్ ఝా అశీష్ గురించి తెలిసి అశీష్ ను ప్రశంసించారు. అశీష్ పట్టుదల, అంకిత భావాన్ని సంజీవ్ కుమార్ మెచ్చుకున్నారు. ఎవరి సాయం లేకుండా పనులన్నీ చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా అశీష్ నిలుస్తున్నాడని సంజీవ్ కుమార్ అన్నారు. 
 
నేటి యువత అందరికీ ఆదర్శంగా నిలుస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న అశీష్ ను ఆదర్శంగా తీసుకోవాలని సంజీవ్ కుమార్ అన్నారు. కొంతమంది అన్ని అవయవాలు సక్రమంగా ఉండి అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న కారణాలకే నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వారు అశీష్ ను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. చిన్న చిన్న కారణాలకే బాధ పడిపోయేవారు బాధలన్నీ వారే అనుభవిస్తున్నట్లు ఫీల్ అయ్యే వారు అశీష్ ను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: