ప్రియాంక రెడ్డిపై అత్యాచారం, హత్య విషయంలో యావత్ దేశం అట్టుడికిపోతోంది.  ఇక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.  ఎవర్ని అడిగినా దాని గురించే మాట్లాడుకుంటున్నారు.  హత్యను నిరసిస్తూ.. హత్య చేసిన వాళ్ళను నడిరోడ్డులో ఉరి తీయాలని, కాల్చి చంపాలని అంటున్నారు.  ఏ మాత్రం ఆలస్యం చేసినా నిందితులు హ్యాపీగా జైల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారని, కానీ, ప్రియాంక రెడ్డి బంధువులు మాత్రం వారిని చూసి నిత్యం బాధతో కుమిలిపోవాల్సి వస్తుందని అంటున్నారు.  
ప్రియాంక రెడ్డి  హత్య చేసిన నిందితులు ఇప్పుడు జైలులో ఉన్నారు.  నిందితులను ఉరి తీయాలని రాజకీయ నాయకుల నుంచి సెలేబ్రిటిల వరకు కోరుకుంటున్నారు.  అయితే, ఈ ఘాటనపై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ చేసే వ్యాఖ్యలు వివాదంగా ఉన్నాయా లేదంటే ప్రియాంక రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాయా చూద్దాం. 
ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసిన నిందితులను వర్మ పిచ్చి కుక్కలతో పోల్చాడు.  పిచ్చి కుక్కలను చంపినంత మాత్రానా మరో పిచ్చికుక్క రాకుండా ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.  పిచ్చికుక్కను చంపడం కాదని, పిచ్చి కుక్క రోగం కుదిర్చే ప్రయత్నం జరగాలని అంటున్నారు.  దాని అర్ధం ఏమంటే... నిందితులను పోలీసులు ఇంటరాగేషన్ జరిగే తీరును దేశం మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేయాలనీ, అప్పుడే నిందితుల నేర స్వభావం ఎలా ఉన్నది.  
ఎలా వారి ప్రవర్తన, మానసిక స్థితి ఉంటుంది.. నీరే చేసే సమయంలో ఎలా ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు తెలుస్తాయని అన్నారు.  తద్వారా భవిష్యత్తులో ఎప్పుడైనా అలంటి వ్యక్తులు తారసపడినపుడు వారి బిహేవియర్, చూపులను బట్టి అర్ధం చేసుకొని అక్కడి నుంచి తప్పించుకోవచ్చని వర్మ అంటున్నాడు.  వర్మ చెప్పింది రైటే... కానీ, సమాజంలో చీడపురుగులు ఏరి వేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది.  కాబట్టి వర్మ చెప్పినట్టుగా ఇంటరాగేషన్ ను ప్రత్యక్ష ప్రసారం చేసి, ఆ తరువాత వారిని ఉరి తీయడమో లేదంటే.. కాల్చి చంపేయడమో చేస్తే బాగుంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: