హైదరాబాద్ షాద్నగర్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. మానవ మృగాల్లాంటి  నలుగురు మగాళ్లు  అమాయకపు ఆడపిల్లని అతి దారుణంగా అత్యాచారం చేశారు అనంతరం హత్య చేసిన ఘటన అందరినీ కలిచివేసింది. ప్రియాంక రెడ్డి అత్యాచార హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష పడాలి అంటు  దేశం మొత్తం నినదిస్తోంది. వీ వాంట్  జస్టిస్ అంటూ ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.నిర్భయ  లాంటి కఠిన చట్టాలను తీసుకు వచ్చిన తర్వాత కూడా మహిళలపై అత్యాచారాలు జరగడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.కాగా  ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం. 

 

 

 

 ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై అటు రాజకీయ సినీ ప్రముఖులు అందరు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నిందితులకు ఉరిశిక్ష ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు . ప్రియాంకా రెడ్డి హత్య ఉదంతం పై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్... మహిళలు చిన్నారులపై అత్యాచారాలు హత్యలు చేసేవాళ్లు  దోషులుగా తేలిన తర్వాత వెంటనే ఉరిశిక్ష విధించాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు చట్టాల్లో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్దేశిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏడేళ్ల క్రితం నిర్భయ దారుణంగా హత్యకు గురైంది... అప్పటి నిందితులను ఇంకా ఉరితీయలేదు... కొన్నాళ్ల క్రితం 9 నెలల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. 

 

 

 

 కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించినప్పటికి ... హైకోర్టు నిందితులకు  ఉరిశిక్ష కాస్త  జీవిత ఖైదుగా మార్చింది హైకోర్టు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ లో వెటర్నిటీ డాక్టర్  ప్రియాంక రెడ్డి దారుణ హత్యకు గురైంది. హంతకులు  దొరికారు మరి బాధితురాలికి ఎలా న్యాయం చేద్దాం... ఆలస్యం అయింది అంటే న్యాయం జరగనట్టే. దీని మీద ఒక రోజు మొత్తం పార్లమెంటులో చర్చ జరుపుదాం.. ఐపీసీ సీఆర్పీసీ లో కొన్ని సవరణలు తీసుకు వద్దాం. మహిళలపై చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధిద్దాం. ఎలాంటి ఆలస్యం చేయకూడదు. కోర్టు తీర్పు మీద రివ్యూ కి వెళ్లే అవకాశం కూడా నిందితులకు ఇవ్వకూడదు. చట్టాలు మారాల్సిన సమయం వచ్చింది అంటు  తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి మోదీకి ట్విట్  చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: