నవంబర్ 27 సాయంత్రం 6 గంటల నుంచి ప్రియాంక మృత్యు ఘడియలు ప్రారంభమయ్యాయి.  సాయంత్రం 6 గంటల సమయంలో ఎప్పుడు బైక్ పార్క్ చేసే చోట బైక్ పార్క్ చెయ్యొద్దు అని చెప్పినపుడు ఆమె తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మరోలా ఉండేది.  కానీ, అక్కా కాకుండా ఆమె ఓఆర్ఆర్ టోల్ ప్లాజా నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న మరో ప్రాంతంలోకి వచ్చి అక్కడ బైక్ పార్క్ చేయడంతో ఆమె జీవితం చివరి దశకు చేరుకున్నది.  అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు నిందితులు స్కెచ్ వేశారు.  
అప్పటికే మత్తులో ఉన్న కామాంధులు ఆమెపై కన్నేశారు.  బైక్ అక్కడే పెట్టింది కాబట్టి రాత్రి ఏ సమయానికైనా సరే తిరిగి వస్తుంది... కాబట్టి అక్కడే వేచి ఉండాలని అనుకున్నారు.  అనుకున్నట్టుగానే అక్కడే కూర్చుకున్నారు.  అమ్మాయి రాత్రి 9:20 వచ్చింది.  ఇక మరో 20 నిమిషాల్లోనే ప్రమాదం ముంచుకు రాబోతున్నది.  ఆమె బైక్ ను రిపేర్ చేయిస్తామని చెప్పి తీసుకెళ్లారు.  అదే సమయంలో మహ్మద్ ఆరిఫ్ ఫోన్ నెంబర్ ను తీసుకుంది.  తీసుకోలేదు.  ఆరిఫ్ మొబైల్ నుంచి ఆమెకు ఫోన్ చేశారు.  
వెంటనే తీసుకొస్తాడు.. ఆలస్యమైనా ఈనెంబర్ కు కాల్ చేయమని చెప్పాడు.  సరే అని ఆమె నమ్మింది.  15 నిముషాలు వెయిట్ చేసింది.  ఆ తరువాత కాల్ చేసింది.  వస్తున్నామని చెప్పారు.  ఆలా చెప్పిన కాసేపటి మహ్మద్ ఆమె నోరు గట్టిగా మూసెయ్యడం.. ఎత్తుకెళ్ళడం పాడు చేయడం అన్ని జరిగిపోయాయి.  అక్కడి నుంచి మొత్తం మారిపోయింది.  పోలీస్ కంప్లైంట్ తీసుకున్నాక.. కేసును పరిశీలించే ముందు ఆమె మొబైల్ ఫోన్ లో ఎవరెవరికి ఫోన్ చేసిందని ఆరాతీయడం మొదలు పెట్టారు.  
లాస్ట్ ఫోన్ చెల్లికి చేసిందని అనుకున్నారు.  కానీ, చివరి ఫోన్ ఆమెకు కాదు.. ఆరిఫ్ కు చేసింది.  అదే వారిని పట్టించింది.  ఆరిఫ్ మొబైల్ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడు ఆరిఫ్ ను పట్టుకున్నారు.  29 వ తేదీ తెల్లవారు జామున 3 గంటల సమయంలో నిందితుడు ఆరిఫ్ ను పట్టుకొని తనదైన శైలిలో విచారించడంతో మిగతా ముగ్గురు నిందితులు దొరికారు.  నిందితుల చేతిలో చనిపోయింది ప్రియాంకనే.. అలానే నిందితుడిని పట్టించింది కూడా ప్రియాంకనే.  ప్రియాంక ఆ నిందితులకు ఫోన్ చేయకపోయి ఉంటె నిందితులను పట్టుకోవడం మరికొంత ఆలస్యం అయ్యి ఉండేది.  

మరింత సమాచారం తెలుసుకోండి: