ప్రియాంకారెడ్డి ఇపుడు ఆమె గురించే లోకమంతా అలొచిస్తోంది. అవే కబుర్లు చెప్పుకుంటోంది. కల్లా కపటం తెలియని ఒక అమాయక యువతి అకారణంగా కిరాతకుల బారిన పడి దారుణంగా బలి అయిపోయిందేనని కన్నీరు పెడుతున్నారు. వెటర్నరీ డాక్టర్ గా ఉన్న ప్రియాంక జీవితంలో ఎన్నో సాధించాలనుకుంది. మూగ జీవాల పట్ల తన  ప్రేమను చూపుతూ వాటికి వైద్యం చేస్తూ అక్కడే ఉండాలనుకుంది.

 

అటువంటి ప్రియాంక కళాశాల జీవితం ఎలా సాగింది. ఆమె యూనివర్శిటీ లైఫ్ ఎలా జరిగింది. ఇవన్నీ ఇపుడు ఆసక్తికరమైన అంశాలే. దీని మీద పీవీ నరసింహారావు వెటర్నరీ వర్శిటీ ప్రొఫెసర్ రాం సింగ్ మాట్లాడుతూ ప్రియాంక ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న అమ్మాయి. ఆమె వర్శిటీలో చదివే రోజుల్లో అన్ని విషయల్లోనూ చురుగ్గా ఉండేదని, చదువులో మెరిటోరియస్ గా ఉండేదని చెప్పుకొచ్చారు.

 

ఆమె తెలంగాణా పబ్లిస్ సర్వీస్ కమిషన్ ద్వారా మెరిట్ మీద జాబ్ సంపాదించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆమె సున్నితమైన మనసు కలిగిన యువతిగా ఆయన అభివర్ణించారు. కాలేజీలో కూడా తన చదువు తన ఇల్లు తప్ప మరేమీ ఆమెకు ఉండేవి కావని కూడా ఆయన అన్నారు.

 

ఆమె చదువులో చాలా ప్రతిభ కనబరచేవారని కూడా అయన చెప్పారు. అటువంటి యువతిని ఈ విధంగా ముష్కరులు పొట్టన పెట్టుకోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

 

మరో వైపు ప్రియాంకతో చదువుకున్న తోటి స్నేహితులు కూడా ఆమె చాలా మంచిదని అంటున్నారు. అటువంటి మనిషిని దారుణంగా హింసించి హత్య చేయడం పాశవిక చర్య అంటున్నారు. ఆమె మేనమామ సైతం ప్రియాంక జాలి దయ కలిగిన పిల్ల అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె జంతువుల ప్రేమికురాలని ఆయన అన్నారు. అటువంటి ప్రియాంక విషయంలో ఈ విధంగా జరగడం అంటే తట్టుకోలేకపోతున్నాట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి మంచి అమ్మాయి. తెలివైన అమ్మాయి. భవిష్యత్తు ఉన్న ఒక యువ డాక్టర్ ని కాపాడుకోలేని పాపం ఎవరిది అంటే సమాజానిదేనని అంతా అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: