గత నాలుగు రోజులుగా ఎవరి నోట విన్నా ప్రియాంక రెడ్డి పేరే వినిపిస్తోంది.. ఎక్కడ చూసిన ప్రియాంక రెడ్డి ఫొటోలే కనిపిస్తున్నాయి.. ఏ ఛానల్ ఓపెన్ చేసినా ప్రియాంక రెడ్డి గురించిన వార్తలే వస్తున్నాయి.  ప్రియాంక రెడ్డి జీవితం నలుగురు కీచక మృగాళ్ల చేతిలో బలైంది.  అమాయకమైన ప్రాణం కామాంధుల దాహానికి బలైంది.  రక్కసి మూకలు చేసిన అరాచకాకు కామ క్రీడలో బలిపశువైంది.  నోరులేని మూగజీవాలకు వైద్యం అందించే ప్రియాంక నోరున్న మానవ మృగాల కాటు బలైపోయింది.  
దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుగా, సంఘటన జరిగిన కొన్ని గంటలకు పోలీసులు రెస్పాండ్ అయ్యారు.  ముగ్గురు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఆ అమ్మాయి చివరి చూపులకు కూడా నోచుకోలేకపోయింది.  జరిగిపోయిన సంఘటన పక్కన పెడితే.. నలుగురు నిందితులను ప్రస్తుతం చర్లపల్లి జైలులో హై సెక్యూరిటీ బ్లాక్ లో ఉంచారు.  ఇలాంటి హై సెక్యూరిటీ బ్లాక్ లో ఎవర్ని ఉంచుతారు.. మోస్ట్ వాంటెడ్ ఖైదీలను ఇలాంటి బ్లాక్ లో పెడతారు.  
ఇలాంటి బ్లాక్ లో పెట్టిన వాళ్లకు భోజనం వంటివి కూడా స్పెషల్ గా ఉంటాయోమో చెప్పలేం కదా.  ఇక ఇదిలా ఉంటె, హైసెక్యూరిటీ జోన్ లో ఉన్నప్పుడు అక్కడి ఎవరి పర్మిషన్ లేకుండా మరొక వ్యక్తి ప్రవేశించలేదు.  కాగా, చర్లపల్లి జైలు బయట చాలామంది ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని వారిని బయటకు విడిచిపెట్టాలని, తమకు అందించాలని అంటున్నారు.  మరొక మహిళైతే... జైలర్ బయటకు రావాలని, తమ గోడు వినాలని అంటోంది.  
నలుగురు నిందితులకు జైల్లో ఉన్నన్ని రోజులు తిండి పెట్టకుండా మాడ్చాలని.. ఆకలితో నలుగురు అలమటించిపోవాలని, ఆకలితో చావాలని అంటున్నారు.  నీళ్లు కూడా ఉవ్వకూడదని అంటున్నారు.  ఆలా చేస్తే జైలరు ఉద్యోగం పోతుందని భయపడొద్దని, సుప్రీం కోర్టు వరకు వెళ్లైనా సరే ఉద్యోగం వచ్చేలా చేస్తామని ప్రజలు అంటున్నారు.  మరి ఈ ప్రజల మాటలను జైలరు వింటారా చెప్పండి.  అసలు వినరు కదా.  వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు అంతే.   

మరింత సమాచారం తెలుసుకోండి: