ప్రత్యేక హోదా విషయం హఠాత్తుగా పవన్ కళ్యాణ్ కి గుర్తుకువచ్చింది. అదీ కడప జిల్లా టూర్లోనే, ఆయన ఎన్నికల ముందు సంగతేమో కానీ ఆ తరువాత మాత్రం ఇప్పటివరకూ హోదా వూసు ఎత్తడంలేదు. అటువంటిది పవన్ ఇపుడు మళ్ళీ హోదా విషయం గట్టిగానే ప్రస్తావించారు. అదీ జగన్ అడగడంలేదని అంటున్నారు.  ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ మడతేసిందని కూడా పవన్ విమర్శిస్తున్నారు. హోదా  విషయంలో ప్రధాని నరేంద్ర మోడీని అడిగే ధైర్యం జగన్ కి ఉందా అని కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే కడప జిల్లా రైల్వే కోడూరులో పర్యటించిన సందర్భంగా పవన్ జగన్ పై మరో మారు విరుచుకుపడ్డారు. జగన్ పాలన సరిగ్గా లేదని, ఆయన కొందరికే సీఎం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. జగన్ కి ఏపీకి న్యాయం చేయాలన్న తపన లేదని కూడా ఆయన అంటున్నారు. ప్రత్యేకించి వెనకబడిన రాయలసీమ జిల్లాలకు జగన్ చేసిందేంటి అంటున్నారు.

 

కడప స్టీల్ ప్లాంట్ కంటే జగన్ కి తన సొంత భారతీ సిమెంట్స్ ఎక్కువ అయ్యాయని కూడా పవన్ అంటున్నారు.  సరే ఇవన్నీ ఇలా ఉంటే  ఏపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అందులో ఎవరికీ ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఆయన అందరికీ సీఎం అయినా కూడా తనకు కాదన్నట్లుగా పవన్ వైఖరి ఉంది. ఆయన మాట్లాడితే జగన్ రెడ్డి అంటారు. జగన్ని సీఎం అనడానికి కూడా పవన్ కు  ఇగో అడ్డువస్తోందని ప్రత్యర్ధులు విరుచుకుపడుతూంటారు. ఇక జగన్ని కేవలం వైసీపీ నేత అని కూడా పవన్ పిలుస్తారు. అంటే ఆయన వైసీపీకి అధినేత అని కూడా చెప్పడానికి పవన్ కి ఏదోలా ఉందేమోనని అంటారు.

 

అసలు జగన్ని తాను ఎందుకు సీఎం అని పిలవను అంటే ఆయన కొందరికే సీఎంగా ఉన్నారట. ఆయన ఎపుడైతే అందరికీ సీఎం గా ఉంటారో అపుడే ఆయన్ని పిలుస్తానని అన్నారు. ఇదిలా ఉండగా పవన్ మాటలకు అపుడే సెటైర్లు కౌంటర్లు పడిపోతున్నాయి. చంద్రబాబుని కేవలం ఒక సామాజికవర్గం కోసం పనిచేస్తున్నారని ఆరోపించినది ఇదే పవన్ అని, మరి ఆయన్ని పవన్ సీఎం గారూ అని ఎందుకు పిలిచారో చెప్పాలని అంటున్నారు.

 


కేసీయార్ ఆర్టీసీని విలీనం చేయకపోయినా ఆయన్ని గౌరవనీయ సీఎం గారు అని పిలిచే పవన్ ఆర్టీసీని ఏపీలో విలీనం చేసిన జగన్ని మాత్రం సీఎం అనడానికి ఎందుకు వెనకాడుతున్నారని కూడా గట్టిగా తగులుకుంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే పవన్ ద్రుష్టిలో మాత్రం జగన్ సీఎం కాదుట. వైసీపీ నేతలు మళ్ళీ పవన్ని టార్గెట్ చేయడానికి ఇది ఒక్కడి సరిపోదూ.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: