ప్రియాంక రెడ్డి హత్య కేసుపై దేశంలో ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు.  ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖులంతా స్పందించారు.  ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.  నలుగురు నిందితులకు వెంటనే శిక్ష విధించాలని అంటున్నారు.  మొదటి నుంచి ఆ నిందితులు నేరస్వభావం కలిగిన వ్యక్తులు కావడంతో నేరాలకు పాల్పడుతున్నారు.  ఎవరూ చేయనటువంటి తప్పులు చేస్తున్నారు.  20 నుంచి 25 సంవత్సరాల వయసులో ఆ విధంగా తప్పులు చేశారు అంటే వారు ఎలాంటి వ్యక్తుల్లో అర్ధం చేసుకోవచ్చు.  
అయితే, ఈ విషయంపై దేశం యావత్తు స్పందిస్తోంది.  కానీ, ఈరోజు మధ్యాహ్నం వరకు కెసిఆర్ స్పందించలేదు.  ఈరోజు జరిగిన ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమావేశంలో దీని గురించి ప్రస్తావించారు.  దేశంమొత్తం విస్తృతపోయేలా జరిగిన ఈ సంఘటన తనను ఎంతగానో బాధించిందని అన్నారు.  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  సత్వరమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు త్వరగా చట్టప్రకారం శిక్షపడేలా చేస్తామని అన్నారు.  
వరంగల్ మైనర్ బాలిక విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అక్కడే విచారించమని, 56 రోజుల్లోనే శిక్ష పడేలా చూశామని అన్నారు.  అదే విధంగా నిందితులకు వీలైనంత త్వరలోనే శిక్ష పడేలా చూస్తామని అన్నారు.  ప్రియాంక రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.  ఆడపిల్లలకు కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.  ఆర్టీసీలో పనిచేసే మహిళా ఉద్యోగులు సాయంత్రం 8 లోపే విధులు ముగించుకొని వెళ్లేలా చూస్తామని చెప్పారు.  
ప్రజలు మాత్రం ఈ ఆవేశం చాలారకా ముందే వారిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు.  వెంటనే ఉరేయాలని, లేదంటే 2008లో మాదిరిగానే కాల్చి చంపాలని అంటున్నారు.  వరంగల్ లో సంఘటన తరువాత నిందితుడికి ఉరి శిక్ష వేసినా ఆ తరువాత, ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.  శిక్ష పడిన ఎక్కడ ఉపయోగం ఉన్నది.  కోర్టు విధించిన ఉరి శిక్షలు ఎక్కడ అమలు జరుగుతున్నాయి. ఇప్పటికే 50కి పైగా ఉరి కేసులు ఎదురుచూస్తున్నాయి.  అవన్నీ దాటుకొని వీళ్లకు శిక్ష పడాలి అంటే అది జరిగే పనికాదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: