కమలం చుట్టూ చంద్రబాబు తిరుగుతున్నారు. నిజానికి కమలం సూర్యుడి చుట్టూ తిరగాలి.  కానీ రాజకీయాల్లో మాత్రం చంద్రుడు కమలం కావాలనుకుంటున్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రిగా మారిన బాబు మరోసారి సీఎం అనిపించుకోవాలనుకుంటున్నారు. దాని  కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. అయితే బాబుతో రాజీలు, పేచీలు అన్నీ పూర్తి అయిన కమలనాధులు  ఇక ఈయనగారితో వేగలేం అన్న డెసిషన్ కి వచ్చేశారట.

 

అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో మారాక మరోలా బాబు వైఖరి ఉంటుందన్నది కమలనాధులకు చాలా బాగా  అర్ధమైపోయింది. ఇక ఒక్క చాన్స్ అంటూ వెంటబడినా కూడా నేస్తం కట్టేది లేదని కాషాయ దళం ఖండితంగా చెప్పెస్తోందని టాక్. దానికి టీడీపీ, చంద్రబాబు ట్రాక్ రికార్డే కారణం అంటున్నారు.

 

1999 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని 2004 వరకూ వాజ్ పేయ్ సర్కార్ లో  పనులు చేయించుకున్న బాబు 2004 ఎన్నికల్లో ఓడిపోగానే కటీఫ్ అనేశారు. పెద్ద చారిత్రాత్మకమైన తప్పు చేశానని వారి మీద విమర్శలకు దిగారు. కానీ పదేళ్ళకు అంటే 2014లో బీజేపీతో పొత్తుకు రెడీ అన్నారు. ఏ మోడీనైతే హైదరబాద్ వస్తే అరెస్ట్ చేయిస్తానని హూంకరించారో అదే మోడీతో పొత్తు పెట్టుకుని వేదికలెక్కి ప్రసంగాలు చేశారు.

 

ఇక గత ఏడాది మోడీని అమిత్ షాని దారుణంగా తిడుతూ జనాల్లో విషప్రచారం చేశారని కమలనాధులు ఇప్పటికీ గుర్రుగా ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఎన్నికల్లో ఓడాక బీజేపీ అవసరం బాబుకు గుర్తుకు వచ్చిందని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ మధ్యన కమలంతో మళ్ళీ కలిసేందుకు బాబు రాయబేరాలు పంపించారరని ప్రచారం సాగింది.

 

దానికి బదులుగా బాబుకు షాకింగ్ లాంటి రిప్లై వచ్చిందని అంటున్నారు. బీజేపీతో కలవాలనుకుంటే మాత్రం బాబు తన పార్టీని విలీనం చేయాలన్న కఠినమైన కండిషన్ బీజేపీ పెద్దల నుంచి వచ్చిందట. ఓ వైపు శివసేన దెబ్బతో కునారిల్లిన బీజేపీ ఏ పొత్తుని గట్టిగా నమ్మడంలేదు. దాని కంటే ఆయా పార్టీలని విలీనం చేసుకోవడమే బెటర్ అనుకుంటోందట. 


బాబు విషయంలోనూ ఆయన పార్టీని విలీనం చేసుకుని తామే ఏపీలో రాజకీయ  కధ మొత్తం నడపాలనుకుంటోందట. ఈ కండిషన్ తో షాక్ తిన్న బాబుకు ఏం చేయాలో తోచడంలేదని అంటున్నారు. మొత్తానికి ఇప్పటికైతే  బీజేపీ బాబుని దూరం పెట్టాలనే అనుకుంటోందని టాక్. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: