ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజురోజుకు ఘోరంగా దిగజారిపోతోంది. ఆ పార్టీలో కీలక నేతలు ఏ రోజు వరకు ఉంటారు.. ఏ రోజు ఎవరు చంద్రబాబు కు హ్యాండ్ ఇచ్చి బయటకు పోతారో కూడా అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోగా.. ఇప్పుడు అదే బాటలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు వస్తున్న వార్తలు పార్టీ క్యాడర్‌ను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత చంద్రబాబుకు తాను ఒంటరిగా వైసిపి అధినేత జగన్ పై పోరాటం చేయ‌లేన‌న్న నిర్ణయానికి వచ్చేశారు.

 

వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయం ప్రారంభించినప్పటి నుంచి ఆయన బిజెపితోనే లేదా కమ్యూనిస్టులతో, టిఆర్ఎస్, జనసేనల‌లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఇక ఈ ఏడాది జరిగిన పోరులో ఒంటరిపోరుతో పార్టీ చరిత్రలోనే ఎప్పుడు ఓడిపోనంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారు. ప్రస్తుతం ఏపీ లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి రోజురోజుకు బలమైన నేతగా ఆవిర్భవించారు. ఆయ‌న చాలా బ‌లంగా ఉండడంతో చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలవక పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

జనసేన న‌మ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదిన‌ట్టు అవుతుందన్న విషయం బాబుకు అర్థమైంది.. అందుకే చంద్రబాబు మళ్లీ దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బిజెపి వైపు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాబు ఆర్ ఎస్ఎస్ ద్వారా మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బాబు బ‌తిమిలాడుతుండ‌డంతో టిడిపి ని బిజెపి లో విలీనం చేసేందుకు సిద్ధం అయితే అంతా ఒకే అనే ఆఫర్ ఆ పార్టీ అధిష్టానం ఆర్ఎస్ఎస్ ద్వారా పంపింద‌ట‌. అది తన కంఠంలో ప్రాణం ఉండగా జరిగే పనే కాదని చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారని కూడా తెలుస్తుంది.

 

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ద‌య‌నీయ స్థితిలో ఉన్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేయ‌డం అంటే ఆయ‌న రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఘోర‌మైన అవ‌మాన‌మే అవుతుంది. ఏపీలో ఎంత బ‌ల‌హీనంగా ఉన్నా బీజేపీ కూడా బాబుతో క‌లిసి ప‌ని చేసేందుకు ఓకే చెప్ప‌డం లేదు. ఎందుకంటే ఇక్క‌డ పొత్తులు ఉన్నంత కాలం ఆ పార్టీ ఎద‌గ‌దు... అయినా కూడా బాబుతో క‌లిసేందుకు వాళ్లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఇక అందుకే టీడీపీని వీల‌నం చేయ‌మ‌ని అడిగారు.. ఓ విధంగా చెప్పాలంటే బాబును బీజేపీ ఘోరంగా అవ‌మానించి న‌ట్టే అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: