క్షేత్రస్ధాయిలో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే అదే అనుమానంగా ఉంది. ఆరుమాసాల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డిపై ఏదో విధంగా బురద చల్లుదామని చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. కానీ ఏదీ పెద్దగా వర్కవుట్ కావటం లేదు. అందుకనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపారు. ఆరోపణలదేముంది రూపాయి ఖర్చు లేదు. కానీ తొందరలో వచ్చే స్ధానిక సంస్ధల ఎన్నికల మాటేమిటి ? కాగడా పెట్టి వెతికినా ఒక్క చోట కూడా గట్టి అభ్యర్ధి కనబడటం లేదట. ఇక్కడే ఇద్దరి మధ్య కొత్త ఒప్పందం కుదిరిందని అనుమానంగా ఉంది.

 

తాజాగా రైల్వే కోడూరులొ మొదలైన పవన్ రాయలసీమ పర్యటనలో ఇదే కొట్టొచ్చినట్లు కనబడుతోంది. రెండు రోజుల క్రితం జగన్ కు వ్యతిరేకంగా టిడిపి అచ్చేసిన  పుస్తకంలో ఏవైతే ఆరోపణలున్నాయో వాటినే పవన్ అప్పజెబుతున్నారు. దాంతో పవన్ కు సొంతంగా రాజకీయాలు చేయటం తెలియదని అర్ధమైపోతోంది. అందుకని పవన్ రాజకీయాల్లో ఉన్నంత వరకూ చంద్రబాబే దిక్కని కూడా స్పష్టమైపోయింది.

 

ఇక విషయానికి వస్తే తొందరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్నాయి. జనసేన తరపున పోటి చేయటానికి అభ్యర్ధులు దొరుకుతారా అన్నదే అందరిలో పెరిగిపోతున్న సందేహం. ఎంతో బలంగా ఉందని చంద్రబాబు చెప్పుకునే టిడిపికే గట్టి అభ్యర్ధులు దొరికేది అనుమానంగానే ఉంది. అలాంటిది అసలు నేతలు లేరు, కార్యకర్తలు లేరు. అసలు పార్టీ నిర్మాణమే జనసేనకు లేదన్నది వాస్తవం.

 

ఈ పరిస్ధితుల్లో సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి స్ధానాలకు పోటి చేయటమంటే మామూలు విషయం కాదు. అధికారంలో ఉన్నారు కాబట్టి వైసిపికి ఇబ్బంది లేదు. మొన్నటి వరకూ అధికారంలో ఉంది కాబట్టి, బలమైన పార్టీ నిర్మాణముంది కాబట్టి టిడిపి పరిస్ధితి కూడా ఏదో పర్వాలేదనే అనుకోవాలి. మరి జనసేన పరిస్ధితేంటి ? జరుగుతున్న ప్రచారమేమిటంటే జనసేన తరపున పోటి చేయాల్సిన అభ్యర్ధులను కూడా చంద్రబాబే సర్దుబాటు చేస్తారని. టిడిపికే గట్టి నేతలు లేరని అనుకుంటుంటే మళ్ళీ జనసేనకు కూడా చంద్రబాబే సర్దాలా ? చూద్దాం ఏం జరుగుతుందో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: