తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా... ఇప్పుడు ఈ పేరు చెప్తే చాలు సొంత పార్టీ నేతలు కూడా ఆయనపై ఒంటి కాలు మీద లేస్తున్నారు. అసలు ఆయన కారణంగానే జిల్లాలో పార్టీ ఓడిపోయిందని గెలవాల్సిన ఎన్నో సీట్లు ఆయన కారణంగానే పార్టీ కోల్పోయిందని ఎవరికి తోచిన విమర్శలు వాళ్ళు ఆయన లక్ష్యంగా చేస్తున్నారు. ఆయన జిల్లాలో బలమైన సీనియర్ నేత గా ఉండటంతో చంద్రబాబు ఎప్పటి నుంచో ఉమాకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.

 

దీనిని ఉమా తనకు అనుకూలంగా మార్చుకుని, పార్టీలో అనవసర పెత్తనం అంతా చేసారు. విజయవాడ పార్లమెంట్ సీటు లో నానీ గెలవకూడదు అనే భావనలో ఆయన కొందరికి సహకరించారు అనే ఆరోపణలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక ఇది పక్కన పెడితే... పార్టీ ఆఫీస్ విషయంలో ఉమా చేసిన హడావుడి కేశినేని నానికి చిర్రు ఎత్తుకు వచ్చింది. ఇక ఆ తర్వాత చంద్రబాబు.. గల్లా జయదేవ్ వంటి వారు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు.

 

అయితే ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచిందని అంటున్నారు. ఒక పక్క వంశీ పార్టీ మారకుండా ఉండటానికి గాను... నాని, కొనకళ్ళ నారాయణ మంతనాలు జరుపుతుంటే... ఉమా... యార్లగడ్డ వెంకట్రావు తో మాట్లాడే ప్రయత్నం చేశారు. వంశీ కోపం అంతా ఉమా మీద అని తెలిసిన నానీ... ఇక ఆయన పెత్తనం నీ మీద ఉండదు వంశీ అని ఒక పక్కన చెప్తుంటే... వంశీని పంపడానికి ఉమా చూసారట.

 

ఈ విషయం నాని ఇటీవల తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారట. ఇలాంటి చేష్టలే పార్టీని నాశనం చేస్తున్నాయని... రాజకీయంగా ఇలాంటి వ్యవహారాలూ మంచివి కావనే విషయాన్ని చంద్రబాబుకి కూడా నానినీ చెప్పారట. ఎవ‌రెన్ని చెప్పినా ఉమాపై బాబుకు ఎంత మాత్రం ప్రేమ త‌గ్గ‌ద‌నే విష‌యం జిల్లా టీడీపీ నేత‌ల‌కు తెలియంది కాదుగా...!

మరింత సమాచారం తెలుసుకోండి: