ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుసాయి . సాధారణం కంటే ఎక్కువ మోతాదులో వర్షాలు కురవడంతో ప్రజలు మొత్తం బెంబేలెత్తిపోయారు. కొన్ని చోట్ల భారీగా కురుస్తున్న వర్షాలు గ్రామాలను సైతం ముంచి  వేయడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక  తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాల వలన చాలా వరకు నష్టాన్ని కలిగించింది. సాధారణం కంటే భారీగా కురుసిన  వర్షాలతో ఎంతో మంది రైతులు తమ పంట నష్ట పోయారు. ఇక మరెన్నో చోట జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురిసిన వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి విష జ్వరాల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. దీంతో వర్షం పడితే బాగుంటది అనుకున్న ప్రజలు వర్షం  వద్దు బాబోయ్ అన్నారు . 

 

 

 

 అయితే నెల కిందట కురిసిన జోరు వర్షాలతో ఇప్పటికే  అంత అస్తవ్యస్తంగా మారగా...  మరోసారి వర్షాలు ముంచెతెందుకు  సిద్ధమవుతున్నాయి. రానున్న 48 గంటల్లో ఏపీ లోని పలు జిల్లాల్లో సాధారణం కంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా  ఏపీ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు ప్రజలు ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలి  అంటూ హెచ్చరిస్తున్నారు వాతావరణశాఖ అధికారులు. 

 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు భారీ వర్షాలు,  మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం సోమవారం నాటికి దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాలపై  పడుతుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి పైన కూడా అల్పపీడన ప్రభావం కనిపిస్తోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటికే  శని ఆదివారాలు బెంగళూరు సహా పలు తీరప్రాంతాల్లో  ఓ మోస్తారు వర్షం కురిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: