జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వలనే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అనేది కొందరి మాట. రాజకీయంగా ఆ పార్టీ అప్పుడు బలపడటానికి పవన్ కళ్యాణ్ అందించిన సహకారమే అని అంటూ ఉంటారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా పవన్ సొంత సామాజిక వర్గంలో సగానికి పైగా చంద్రబాబుకి ఓటు వేసారట. ఆ తర్వాత పవన్ కు చంద్రబాబు కి నాలుగేళ్ళు సఖ్యతగానే ఉన్నా అనూహ్యంగా చివరి ఏడాది ఇద్దరికీ చెడింది.

 

ఇక తాను బలంగా ఉన్నాను తనను పవన్, జగన్, బిజెపితో కలిసి ఇబ్బంది పెడుతున్నారని, చంద్రబాబు పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక తన పాలన మీద నమ్మకం ప్రజలకు ఉందని... ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో తాను గెలుస్తాను అని బాబు అతి ధీమాకు పోయారు. పవన్ ఒంటరిగా పోటి చేసినా తనకు వచ్చే నష్టం లేదు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలుతుంది... పవన్ సొంత సామాజిక వర్గానికి తాను ఎంతో న్యాయం చేసాను అనే భావనలో ఉన్నారు. అయితే అనూహ్యంగా పార్టీ ఓటమి పాలైంది.

 

పవన్ కారణంగానే 30 నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయి౦దనే విషయం తెలుసుకున్న చంద్రబాబు... పవన్ తనతో ఉంటేనే మంచిది, పవన్ ఫాలోయింగ్ తనకు ఉపయోగపడుతుందని భావించారు. అందుకే ఎన్నికల తర్వాత పవన్ తో కలిసి పోరాటం చెయ్యాలని భావించారు. కాని ఇప్పుడు పవన్ తో ముందుకి వెళ్తే... కమ్మ సామాజిక వర్గం దూరం జరుగుతోంది.. చాలా మంది క‌మ్మ వాళ్లు కూడా బాబు ఎన్టీఆర్‌ను కాద‌ని ప‌వ‌న్‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌డాన్ని జీర్ణించు కోలేక‌పోతున్నారు.

 

ఇక రెడ్డి సామాజిక వర్గంలో ఒక‌టీ అరా నేత‌లు కూడా పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందనే అంచనాకు చంద్రబాబు వచ్చారు. ఇక ఆయనతో కలిసి పోరాడే విషయంలో వెనక్కి తగ్గాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే పవన్ స్నేహం అంత మంచిది కాదనే భావనలో చంద్రబాబు ఉన్నారట. అందుకే... సీనియర్ నేతలకు కూడా పవన్ తో దూరమే మంచిది అని స్పష్టం చేశారట చంద్రబాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి: