నేడు తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమైన విషయం తెల్సిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. దాదాపు రెండు గంటలపాటు కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపారు. కాగా ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల బాగోగులు ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు ఈ సమావేశంలో వరాల జల్లు కురిపించారు. దీంతో సమావేశానికి హాజరైన ఆర్టీసీ కార్మికులు అందరూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆర్టీసీ కార్మికులకు 26 రకాల హామీలను ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదంటూ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఆర్టీసీకి లాభాలు వచ్చేలా ఆర్టీసీ కార్మికులు సంస్థ ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సంస్థను  లాభాల్లోకి తీసుకు వచ్చినప్పుడు ఆర్టీసీ కార్మికులకు కూడా సింగరేణి కార్మికులకు ఇచ్చినట్లుగానే ప్రతి ఏడాది బోనస్ ప్రకటిస్తామని తెలిపారు. 

 

 

 

 ఆద్యంతం అత్యంత మానవీయ కోణంలో ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. దీంతో సమావేశానికి హాజరైన ఆర్టీసీ కార్మికుల కన్నుల్లో ఆనందబాష్పాలు వెల్లివిరిసాయి . అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ పిట్ట కథ  చెప్పారు. ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టే వాళ్ళు ఉంటారని చెబుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రామాయణ యుద్ధం గురించి ఓ పిట్ట కథ చెప్పారు. రామాయణ యుద్ధం జరుగుతున్న సమయంలో రామబాణానికి  సగం ప్రాణం కోల్పోయిన కొంత మంది రాక్షసులు తమ  పరిస్థితి ఏంటని రామున్ని  అడిగారట. దీంతో కలియుగంలో మీరు అక్కడ అక్కడ పుడుతారు మనుషులను ఇబ్బందులకు గురి చేస్తూ పీక్కు తింటూ ఉంటారు అని రాముడు చెప్పాడట. ప్రస్తుతం వారు  ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అంటూ కేసీఆర్ అన్నారు. 

 

 

 

కేసీఆర్ చెప్పిన పిట్టకథతో  సమావేశానికి హాజరైన ఆర్టీసీ కార్మికులు అందరూ ముఖాల్లో నవ్వులు విరిశాయి . కాగా ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న కేసీఆర్... భోజనం సమయంలో డ్రైవర్లు కండక్టర్ల తో ఆత్మీయంగా మాట్లాడి వారి కడుపు నింపేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తమను  ఆత్మీయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు ఆనందంతో మురిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు  తమ కష్టసుఖాలు తెలుపుకున్నారు ఆర్టీసీ కార్మికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: