దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రియాంకను నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లి ప్రియాంక గొంతు, నోరు, ముక్కు మూసేసి ప్రియాంకపై నిందితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రియాంక చనిపోయిన తరువాత ప్రియాంక మృతదేహంపై కూడా నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ కేసులో మహ్మద్ అరీఫ్ ప్రధాన నిందితుడు కాగా జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఏ2, ఏ3, ఏ4లుగా ఉన్నారు. ప్రియాంక హత్య కేసు నిందితులకు సంబంధించిన నేర చరిత్ర బయటపడుతోంది. ప్రియాంక రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్ అరీఫ్ ప్రియాంక హత్యకు ముందు దొంగతనం చేశాడు. లారీ డ్రైవర్ మహ్మద్ అరీఫ్ కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. 
 
అరీఫ్ లారీని రవాణా శాఖ అధికారుల కళ్లు గప్పి తీసుకొనిపోయాడు. ఐరన్ రాడ్ లోడ్ ను రాయచూర్ లో డెలివరీ చేసిన ఆరీఫ్ అందులోని కొన్ని రాడ్లను డెలివరీ చేయటానికి ముందే దొంగలించాడు. ఆ ఐరన్ రాడ్లను దాచి లోడ్ డెలివరీ చేశాడు. ఆ తరువాత దాచి ఉంచిన ఐరన్ రాడ్లను అమ్మేసి ఆ డబ్బులతో అరీఫ్ మద్యం కొన్నాడు. మద్యాహ్నం సమయంలో అరీఫ్ తో పాటు మిగతా ముగ్గురు మద్యం తాగారు. 
 
అటు వైపుగా వెళ్లే కొంతమంది ఆడపిల్లల్ని కూడా నిందితులు వేధించారు. సాయంత్రం ప్రియాంక స్కూటీని టోల్ గేట్ దగ్గర ఉంచడం గమనించిన నిందితులు ప్రియాంక స్కూటీలో గాలి తీసేశారు. ఆ తరువాత ప్రియాంకను స్కూటీ బాగు చేయిస్తామని నమ్మించి మద్యం తాగించి నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రియాంక అరీఫ్ కు పంక్చర్ చేయిస్తామని తీసుకెళ్లిన స్కూటీ గురించి కాల్ చేయడం వలన పోలీసులు తేలికగా ప్రియాంక హత్య కేసు నిందితులను పట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: