హైదరాబాద్ షాద్నగర్ సమీపంలో వైద్యుల ప్రియాంక రెడ్డి అత్యాచారం హత్య ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. నలుగురు కామాంధులు పక్క పథకంతో అమాయకురాలైన  ఆడపిల్ల ని అతి దారుణంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన అందరినీ కలిచివేసింది. అత్యాచారం హత్య కేసు నిందితులకు ఉరిశిక్ష పడాలి అంటూ  దేశం మొత్తం నినదిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులకు  కఠిన శిక్ష పడాలి అంటూ దేశం మొత్తం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలను తీసుకు వచ్చినప్పుటికీ  కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉండటం  విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక ప్రియాంక రెడ్డి  హత్యతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు . తన కూతురు హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రియాంకా రెడ్డి తల్లిదండ్రులు. 

 

 

 

 అతి దారుణంగా లైంగిక దాడికి గురై హత్య చేయబడ్డ మృతురాలికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ కొత్త పేరు పెట్టారు. వాస్తవానికి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అత్యాచారానికి గురైన వ్యక్తి ఫోటో గాని వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు గాని  ఫోటోలు గాని  నిందితుల ఫోటోలు కానీ మీడియా ప్రచురించడానికి అనుమతి ఉండదు... అది చట్టరీత్యా నేరం. అయితే షాద్నగర్ ఘటనలో మృతురాలి ఫోటో పేరు క్షణాల్లో దేశం మొత్తం వ్యాపించింది. దీంతో జరగాల్సిన నష్టం కాస్త అప్పటికే జరిగిపోయింది. అయితే తాజాగా ప్రియాంక రెడ్డి పేరును దిశగా మార్చుతూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటినుంచి బాధితురాలిని దిశ పేరుతో పిలవాలని ఆయన సూచించారు. 

 

 

 

 ఈ మేరకు మృతురాలి తల్లిదండ్రులను  కూడా ఒప్పించారు. ఇప్పటి నుంచి మీడియా బాధితురాలి అసలు పేరుకు బదులు జస్టిస్ ఫర్ దిశగా పిలవాలని చెప్పారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. బాధితురాలి పేరు బయట పెట్టవద్దని ఉద్దేశంతోనే పేరు మార్చినట్లు సజ్జనార్ వెల్లడించారు. కాగా  యువతిపై అత్యాచారం చేసి అనంతరం దారుణంగా హత్య చేసిన నలుగురు నిందితులు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉండగా... ఎట్టి పరిస్థితిలో వారిని ఉరితీయాలని దేశ ప్రజానీకం నిరసన వ్యక్తం చేస్తోంది. నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైలులో పోలీసుల రిమాండ్లో ఉన్నారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: