ప్రియాంక రెడ్డితో సంబంధం ఉన్న సంఘటన సైబరాబాద్‌లో జరిగింది, ఇది రంగారెడ్డి జిల్లాలో ఉంది, హైదరాబాద్‌లో కాదు అని ప్రపంచానికి తెలియ చేయడానికి  హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజని కుమార్ శనివారం మధ్యాహ్నం ట్విట్టర్‌లోకి వెళ్లి ఒక ట్వీట్ చేశారు. అయన  ట్వీట్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది,  పెద్ద సంఖ్యలో ప్రజల నుండి ఈ ట్వీట్ కి వ్యతిరేకత రావడం తో  అంజని కుమార్ గారు  తన ఈ  ట్వీట్‌ను గంట వ్యవధిలో తొలగించారు.

 

 

హైదరాబాద్‌లో ఈ సంఘటన జరిగిందని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అందరూ పేర్కొంటున్నారని అంజని కుమార్ కలత చెందారు. ఈ సంఘటన తన అధికార పరిధి అయినా హైదరాబాద్ లో  కాకుండా సైబరాబాద్ కమిషనరేట్‌  పరిధి లో జరిగిందని ఆయన స్పష్టం చేయాలనుకున్నారు.

 

 

అంజని కుమార్ గారు తన  ట్వీట్ లో ఇలా చెప్పారు. అత్యాచారం మరియు హత్య కేసు రంగారెడ్డి జిల్లాకు చెందిన  సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి  లోనిది అని,  ఒక ఛానెల్ ఈ సంఘటనను  తప్పుగా   ఇది  హైదరాబాద్ పరిధి  లో జరిగిన  సంఘటనగా  పేర్కొంది అని అన్నారు.

 

 

ప్రజలు ఈ ట్వీట్ కి స్పందిస్తూ ఇప్పుడు  ఈ ట్వీట్ పెట్టడం అంత   అవసరమా,  దీని వాళ్ళ ఏమైనా ఉపయోగం  ఉందా అని మరియు ఇప్పుడు ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏమిటి అని రీట్వీట్ చేసారు.  

 

 

హైదరాబాద్ ఉటోపియాన్ గ్లోబల్ సిటిజెన్స్ హ్యాండిల్ వారు  మాట్లాడుతూ, ప్రపంచానికి ఇది హైదరాబాద్,  ఇక్కడ మూడు  కమిషనరేట్లు ఉన్నప్పటికీ  ఇది హైదరాబాదే.  చుట్టూ పక్కల ఎన్ని ప్రాంతాలు ఉన్న ప్రజలు దీన్ని హైదరాబాదే అంటారు. ప్రియాంక రెడ్డి హత్య మరియు హత్యాచారం సంఘటన గురించి మాట్లాడుతూ ఇది   దిగ్భ్రాంతికరమైన మరియు విషాదకరమైన సంఘటన అని, నేరస్తులను కఠినంగా శిక్షించాలి అని అన్నారు.  మరో ట్వీట్ ప్రకారం,  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాద్ అని ట్వీట్ చేసినప్పుడు, అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎందుకు?

 

మరింత సమాచారం తెలుసుకోండి: