ఫుడ్ డెలివరీ.. ఎప్పుడైనా ఎక్కడైనా మనకు ఆకలి అవుతుంది అంటే.. ఒక స్మార్ట్ ఫోన్ ఆన్ ఫుడ్ డెలివరీ యాప్ ని ఇంస్టాల్ చేసుకొని ఆర్డర్ పెడితే చాలు ఈజీగా ఫుడ్ వచ్చేస్తుంది. అయితే ఆర్డర్ చేసినప్పుడు జేబులో డబ్బులు ఉండాలి సుమీ.. ఫ్రీ అయితే కాదు. ఇంకా విషయానికి వస్తే.. ఫుడ్ పాండా, స్విగ్గి, జొమాటో, ఉబెర్ ఈట్స్ ఇలా అన్ని ఫుడ్ డెలివరీస్ యాప్స్ బోలెడు ఉన్నాయి. 

 

ఈ యాప్స్ లో ఫుడ్ మొదట్లో బాగా కాస్టలీగా, నాణ్యతతో ఉన్న ఫుడ్ వచ్చేది. కానీ మార్కెట్ పెంచుకోవాలని కాకృతి పడ్డాయి ఫుడ్ డెలివరీ యాప్స్. మొదట్లో ఏముంది.. మార్కెట్ ఒకేసారి ఓ రేంజ్ లో వెళ్ళింది. కానీ అప్పుడు తెలీలేదు ఆ ఫుడ్ డెలివరీస్ యాప్ కు. ఆఫర్స్ తీసేస్తే మార్కెట్ ఒకేసారి పడిపోతుంది అని.  

 

మొదట్లో బాగా ఆఫర్లు ఇచ్చి నాణ్యమైన ఫుడ్ పెట్టిన.. ఆ ఆఫర్లు అలాగే కొనసాగించలేక వెంటనే ఆపేసింది. ఒకేసారి మార్కెట్ పడిపోయింది. ఆ తర్వాత మళ్ళి ఆఫర్లు పెట్టింది. కానీ ఈసారి ఓ పెద్ద ప్లాన్ తో ఆ ఆఫర్లను తీసుకొచ్చారు. ఆ ప్లాన్ ఏంటి అంటే.. ఆఫర్లు ఇవ్వాలి కానీ నాణ్యమైన ఆహారం ఇవ్వకూడదు.. ఒకవేళ ఆఫర్ ఇచ్చిన సరే ఎక్కువ రేట్లు పెట్టి తక్కువకు ఇచ్చినట్టు చూపాలని నిర్ణయం తీసుకుంది.. ఇలా వచ్చిన మొదట బానే ఉంది.. తర్వాత క్వాలిటీ లేదు మాకొద్దు అనుకున్నారు జనాలు. 

 

ఇంకా ఇప్పుడు అయితే మంచి ఫుడ్ తినాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని.. భోజనం ఇంటి నుండి తెప్పించుకుంటున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఫుడ్ ఆర్డర్ యాప్స్ మార్కెట్ పడిపోయింది. దీనికి తోడు అమెజాన్ యాప్ కూడా ఫుడ్ ఆర్డర్ యాప్ ని ప్రారంభిస్తా అని చెప్పింది. ఇంకా ఇప్పుడు ఉన్న స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ పరిస్థితి ఎం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: