2012 నిర్భయ ఉదంతం తర్వాత మళ్ళీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వేర్వేరు అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించిన నిందితులను ఆర్టీఓ, పోలీసులు రెండుసార్లు వదిలేయడమే ప్రియాంక బలైపోవడానికి కారణమైంది. ప్రియాంక పై హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు నిందితులు వస్తున్న లారీని మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడం, పైగా ఓవర్‌ లోడ్‌ ఉండటంతో నిబంధనల ప్రకారం లారీని సీజ్‌ చేయాలి. కానీ ఆర్టీఓ వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత తొండుపల్లి చేరుకున్న నిందితులు లారీని హైవేపై 'నో' ప్లేస్ లో అక్రమంగా పార్క్‌ చేశారు. ఇక్కడే గనక నిందితులను అదుపులోకి తీసుకొని ఉంటే ఈ రోజు ప్రియాంక తన కుటుంబ సభ్యుల మధ్య నవ్వూతు ఉండేది. 

 

నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు.. పోలీసు పెట్రోలింగ్‌ వాహనం వచ్చి అక్కడి నుంచి లారీని తీసేయాలని హెచ్చరించడంతో.. దగ్గర్లోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డులోకి లారీని తీసుకెళ్లి నిలిపారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో మద్యం కొనుగోలు చేసి, కేబిన్‌లోనే తాగుతూ కూర్చున్న సమయంలో లారీ పక్కనే స్కూటీ పార్క్‌ చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ ప్రియాంకారెడ్డిని చూశారు. ఆమె అందంగా ఉందని, స్కూటీ కోసం తిరిగి వచ్చినప్పుడు తనపై అత్యాచారం చేయాలని నిందితులు పథకం చేశారు. పథకం ప్రకారం స్కూటీ వెనుక టైర్‌ను నవీన్‌ పంక్చర్‌ చేశాడు. రాత్రి 9.30 గంటల సమయంలో ప్రియాంక తన స్కూటి దగ్గరకు వచ్చింది. ఆరిఫ్, చెన్నకేశవులు ప్రియాంక దగ్గరకి వెళ్లి మీ స్కూటీ టైర్‌ పంక్చర్‌ అయింది అంటూ మాట కలిపారు. తనకు సహాయం చేస్తున్నట్టు నటించారు. స్కూటీ టైర్‌లో గాలి నింపుకొని తీసుకురావాలని ఆరిఫ్‌.. శివను పంపించాడు. ఆరిఫ్‌ మాట్లాడుతుండగానే పరిస్థితి అర్థం చేసుకున్న ప్రియాంక తన చెల్లెలికి ఫోన్‌ చేసి లారీ డ్రైవర్లును చూస్తుంటే భయమేస్తోందని చెప్పింది. 

 

శివ గాలి నింపుకొని తిరిగి వచ్చిన వెంటనే నిందితులు తమ పథకాన్ని అమలు చేశారు. ఆరిఫ్‌ ప్రియాంక చేతులు పట్టుకోగా.. చెన్నకేశవులు ఆమె కాళ్లు, నవీన్‌ నడుము వద్ద పట్టుకుని ప్రహరీ గోడ లోపలున్న చెట్ల పొదల్లోకి బలవంతంగా ఎత్తుకెళ్లారు. ప్రియాంక హెల్ప్‌.. హెల్ప్‌ అంటూ అరిచినా.. అరుపులు బయటకు వినిపించకుండా ఆరిఫ్‌ ఆమె నోటిని తన చేతితో మూసివేశాడు. శివ ఆమె దుస్తులను లాగేసి ప్రియాంక నోట్లో మద్యం పోశారు. ఒకరి తర్వాత ఒకరు పాశవికంగా అత్యాచారం చేసి చంపాలని నిర్ణయించుకున్నారు. ఆరిఫ్‌ ప్రియాంక నోరు, ముక్కును చేతులతో గట్టిగా అదిమి పట్టడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. తర్వాత బెడ్‌షీట్‌లో మృతదేహాన్ని చుట్టి లారీలో పడేశారు. ఐవోసీ పెట్రోల్‌ బంక్‌లో నిందితులిద్దరూ పెట్రోల్‌ కొని షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి అండర్‌పాస్‌ కిందికి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. 

 

ఈ సంఘటన జరగడానికి 12 గంటల ముందు అటువైపు వచ్చిన హైవే పెట్రోలింగ్‌ పోలీసులు.. లారీని అక్కడి నుంచి తీసేయాలని హెచ్చరించి వెళ్లిపోయారు. ఇక్కడ మరోసారి నిందితులను పట్టుకునే అవకాశం ఉన్నా తప్పిపోయింది. దీంతో నిందితులు తొండుపల్లి టోల్‌ప్లాజా గేట్‌ దగ్గరున్న సర్వీస్‌ రోడ్డులో లారీని నిలిపి అలాగే ఉంచారు. అక్కడే చాలాసేపు లారీ ఉండటం..అక్కడకు వచ్చిన ప్రియాంకను నిందితులు చూడటంతో వారిలో దుర్బుద్ధి పుట్టి పథకం ప్రకారం ఘాతుకానికి తెగబడ్డారు. ఒకవేళ ఆర్టీఓ ఆ లారీని సీజ్‌ చేసినా.. సర్వీస్‌ రోడ్డులో కూడా అంతసేపు లారీని నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా..ఈ రోజు ప్రియాంక ప్రాణాలతో ఉండేది. ప్రియాంక బలైపోవడానికి ముఖ్య కారణం ఆర్టీఓ, పెట్రోలింగ్‌ పోలీసులు ప్రధాన కారణం అని క్లియర్ గా  అర్థమవుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: