వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఉదంతం రాష్ట్రంలో సంచలనాన్ని రేపింది. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ప్రతిపాదన చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి వెళ్లేలా వరుసగా చేసిన నాలుగు ట్వీట్లలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు.

 

 

ఇక ప్రియాంక సంఘటన పట్ల తీవ్రంగా స్పందించిన కేటీఆర్.... దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)  సీఆర్పీసీలను సవరిస్తూ పార్లమెంట్ లో చట్టం తేవాలని, వేలాది మంది పౌరుల తరఫున తాను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొంటూ చట్టాలను సవరించాల్సిన సమయం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

 

 

ఇదే కాకుండా ఒక రోజుమొత్తంగా ప్రియాంక రెడ్డి హత్యాచారం, మహిళలు పిల్లలపై జరుగుతున్న అత్యాచారాల పైన కఠిన చట్టాల కోసం పార్లమెంటులో చర్చించాలని మోడీకి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇకపోతే దేశంలో జరుగుతున్న అత్యాచారాల్లో నిందితులు పట్టుబడిన్నప్పటికీ, వారికి వేసిన శిక్షల అమలులో తీవ్ర ఆలస్యం అవుతుందని, ఏడు సంవత్సరాల క్రితం నిర్భయ హత్యాచార ఘటనలో నిందుతులకు ఇప్పటికీ ఉరిశిక్ష అమలు జరగడం లేదు, ఇదే కాకుండా తొమ్మిది నెలల పసి పాపపై అత్యాచారం చేసిన నిందితుల ఉరి శిక్షను జీవిత ఖైదుగా  కోర్టు మార్చిన సంఘటనను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

 

 

ఇలాంటి అత్యంత నీచమైన, హీనమైన నేరాలకు పాల్పడు తున్న నీచులకు కఠిన శిక్ష పడేలా, కాలం చెల్లిన ఇండియన్ పీనల్ కోడ్ మరియు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని, మహిళలపై, పిల్లల పైన అత్యాచారాలకు పాల్పడేవారికి ఆలస్యం లేకుండా ఉరిశిక్ష విధించాలని - వీటిపైన తిరిగి సమీక్షకు వీలులేని విధంగా చట్ట సవరణ చేయాలని కోరారు. చట్టాలంటే భయం లేకుండా మహిళల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుర్మార్గుల  నుంచి దేశాన్ని రక్షించుకునేందుకునే సమయం ఆసన్నమైదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: