ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక గత ఆరేళ్ళ వ్యవధిలో ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. ఎవరూ ఊహించలేనివి, అసలు సాహసించలేనివి కూడా ప్రధానిగా మోడీ చేసి చూపించారు. దాయాది పాక్ పీచమణచడంతో పాటు, కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి మోడీ ఘన విజయాలే. ఇక అయోధ్య రామాయలం తీర్పు విషయంలో కూడా కోర్టు బయట ఉభయ వర్గాలను సముదాయించడం ద్వారా సామరస్య వాతావరణం వచ్చేలా మోడీ క్రుషి చేశారని ప్రచారంలో ఉంది.

 

ఇన్ని చేసిన మోడీ ఆ నిర్ణయం కూడా తీసుకోవడానికి ముందుకు వస్తున్నారుట. దేశంలో స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు పై దాటినా ఇంకా బూజు పట్టిన బ్రిటిష్ కాలం నాటి విధానాలనే అమలుచేస్తున్నారు. అప్పటి చట్టాలనే కళ్ళకద్దుకుంటున్నారు. కాలం మారింది. ఆధునిక పోకడలతో జీవన విధానం సాగుతోంది. కొత్త కొత్త నేరాలు జరుగుతున్నాయి. అయినా పాత చట్టాలే దిక్కు అవుతున్నాయి.

 

దాంతో దేశంలో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. గజానికో గాంధారి పుత్రుడు అవతరించి బరితెగిస్తున్నాడు. అమాయకులు బలి అవుతూంటే నేరం చేసిన వాడు కటకటాల నుంచి తప్పించుకుంటున్నాడు. దీంతో ఇపుడు మోడీ సర్కార్ పాత బూజుని దులిపి మానభంగం చేసిన వారికి మరణ దండన విధించేలా చట్టాలను సవరిస్తుందని అంటున్నారు. అదే విధంగా వేగంగా బాధితులకు న్యాయం జరిగేలా కోర్టులను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం. దేశంలో రేపిస్టులు, పాపిస్టులు భయపడేలా  కఠిన చట్టాలను తేవడానికి రెడీ అవుతోందని అంటున్నారు.

 

జాతీయ స్థాయిలో సంచలనం స్రుష్టించిన ప్రియాంకారెడ్డి కేసుపై  మహిళా సంఘాలు గట్టిగానే  ఆందోళన చేపడుతున్నాయి. సరిగ్గా 2012లో నిర్భయ కేసు నాటి వాతావరణమే ఇపుడు ఉంది. అందువల్ల అపుడు యూపీయే సర్కార్ చేయలేని పనిని ఇపుడు తాను చేసి చూపించాలని మోడీ గట్టి పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు.దీని మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చూచాయగా విషయం చెప్పారు. పార్లమెంట్ లో దీని మీద చర్చ జరిపి కొత్త చట్టాలు తెస్తామని ఆయన అంటున్నారు. అదే కనుక జరిగితే మోడీ మహిళా లోకానికి మరచిపోలేని వరాన్ని ఇచ్చినవారు అవుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: