ప్రియాంక రెడ్డి కేసును పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే.  హత్య, అత్యాచారాలు తదితర సంఘటనలు జరిగినపుడు ఆ సంఘటనలకు బాధితులకు, ఆ సంఘటనకు కారకులైన వ్యక్తుల ఒరిజినల్ పేర్లను వాడేందుకు చట్టాలు ఒప్పుకోవు.  దానికి బదులుగా మరొక పేరును వాడతారు.  2012 లో నిర్భయ అత్యాచారం కేసులోను అలానే జరిగింది.  నిర్భయ అసలు పేరు దాదాపుగా ఎవరికీ తెలియదు.  పోలీసులు ఆమె పేరు బదులుగా మరో పేరుతో ఆ కేసును టేకప్ చేశారు.  
అయితే, ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన వివరాలు సడెన్ గా మీడియాకు రావడం.. మీడియాలో ఒక్కసారిగా వైరల్ కావడంతో.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ఈకేసులో విషయంలో ప్రతి ఒక్కరు చాలా శ్రద్ద చూపించారు. ప్రజలు స్వచ్చందంగా బయటకు వచ్చి నినాదాలు చేయడమే కాకుండా, నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని చెప్పి నినాదాలు చేశారు.  షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  కానీ, నిందితులను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలీస్ స్టేషన్ నుంచి చర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు.  వారికీ 14 రోజులపాటు రిమాండ్ విధించారు.  ఈ రిమాండ్ పేరుతో వారిని జైలులోనే ఉంచి కొంత విచారణ చేసే అవకాశం ఉన్నది.  అయితే, పోలీసులు ఇప్పుడు నిందితులను తమ కష్టడికి ఇవ్వాలని రేపు మహబూబ్ నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు.  ఒకవేళ కష్టడికి అప్పగిస్తే.. మరికొన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.  
ఇక ఇదిలా ఉంటె, ప్రియాంక రెడ్డి హత్య ఆమె పేరును చేంజ్ చేస్తున్నారు.  బాధితురాలి పేరును ప్రియాంక రెడ్డి నుంచి దిశగా మార్చారు.  ఇకపై ఈకేసుకు సంబంధించి మీడియాలో దిశా అనే సంబోదించాలి.  ఒరిజినల్ పేరుతో పిలిచేందుకు చట్టాలు ఊరుకోవు.  చాలా కష్టపడి ఆమె పేరు మార్పుకు సంబంధించి పోలీసులు  సూచనలు చేస్తూ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులను కూడా ఒప్పించారు.  ఇకపై వారు కూడా ఈ కేసు విషయంలో మార్చిన పేరుతోనే పిలవాలి.  అది సంగతి.  

మరింత సమాచారం తెలుసుకోండి: