ఈ కాలంలో ఎన్ని చదువులు చదివినా అందరికి ఉద్యోగాలు రావడం లేదు. పెద్దపెద్ద చదువులు చదివిన వారు సైతం చిన్న చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక్కడ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఎంత దారుణమైన దుస్థితిలో ఉన్నారంటే మీరే చూడండి.

 

 

తమిళనాడు కోయంబత్తూర్ సిటీ కార్పొరేషన్ లో 549 శానిటరీ వర్కర్ల పోస్టులకు భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో 7 వేల మంది ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారే అని అధికారులు ప్రకటించడంతో... అది విన్న వారు షాక్ గురయ్యారు. ఇకపోతే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్ లో జాబ్ చేస్తున్న వారూ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ సురక్షితమని భావించి ఈ కొలువుకు అప్లై చేసుకున్నట్లు పలువురు చెప్పారు.

 

 

ఇక అధికారులు బుధవారం నుంచి మూడురోజుల పాటు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. బీఈ చదివిని అరుణ్ కుమార్ అనే నిరుద్యోగి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ. ‘నేను ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. కాని నాకు ఎలాంటి ఉద్యోగం దొరకలేదు. అందుకే నేను పారిశుద్ధ్య కార్మికుడి పోస్టు కోసం దరఖాస్తు చేశాను’’ అని వెల్లడించాడు. కాగా - బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన పూవిజి మీనా - ఎంకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త ఎస్ రాహుల్ సైతం ఇంటర్వ్యూకు వచ్చారు. ఇంటర్వ్యూలో ఎంపికైతే తాము శానిటరీ కార్మికులుగా  పని చేయడానికి అభ్యంతరం లేదని తెలిపారు.

 

 

ఇకపోతే ఈ శానీటరీ  ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి ఉండగా. ప్రారంభ జీతం రూ .15700 వరకు ఉంది. కాగా పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు పని చేయవలసి ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న విశ్రాంతి సమయంలో ఇతర చిన్న పనులు చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఈ ఈ వెసులుబాటు  ఉద్యోగార్థులను ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతో పాటుగా గత పదేళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారు కూడా ఈ శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. చూసారా తలరాత కాకపోతే ఇంకేమిటండి. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు చీపుర్లు పట్టి వీధులు ఊడ్చడం నిజంగా వింతే. 

మరింత సమాచారం తెలుసుకోండి: