ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు, ట్విట్టర్ పిట్టా, ఆంధ్ర పప్పు అబ్బో ఇలా ఒకటి కాదు.. రెండు కాదు బోలెడు పేర్లు ఉన్నాయి నారా లోకేష్ బాబుకి. ఎప్పుడు ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రజలతో తిట్టించుకుంటాడు. 

 

ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలతో తిట్టించుకొనే పని చేశాడు నారా లోకేష్. ఆ పని ఏంటి అనుకుంటున్నారా ? టైటిల్ లో పెట్టాను కదా అండి.. ఆంధ్రాలో ఎంతోమంది ప్రజల పార్టీ వైసీపీ పార్టీని ఘోరాతి ఘోరంగా ఎయిడ్స్ రోగంతో పోల్చాడు ఈ చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్.  

 

ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైసీపీ సైకో సిండ్రోమని, జగన్ అభిమానులను పేటీఎంలో వేసే రూ.5 భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారని లోకేష్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో తనపై వైసీపా కార్యకర్తలు చేసిన విమర్శలకు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.

 
నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ..  ''ఎయిడ్స్ రోగం కంటే పెద్ద జబ్బు వైకాపా సైకో సిండ్రోమ్. జగన్ పేటీఎంలో వేసే ఐదు రూపాయిల భిక్షం కోసం ఎంత నీచమైన పనులు అయినా చేస్తారు. జగన్ చేతగాని వాడు అని ఆరు నెలల్లోనే తేలిపోవడంతో మళ్లీ వైకాపా సైకో బ్యాచ్‌కి పనిపెట్టారు. నన్ను బదనాం చెయ్యడం కోసం ఏమీ దొరకకపోవడంతో నా పేరుతో ఫేక్ మార్ఫింగ్ పోస్టులు పెట్టించి జగన్ గారు శునకానందం పొందుతున్నారు'' అని ట్విట్టర్‌లో పెట్టారు. 

 

అయితే ఈ ట్విట్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.. గట్టిగా ఒక్క ప్రశ్న వేస్తే సమాధానం చెప్పలేక బ్లాక్ చేస్తావ్ మనకెందుకండి ఇలాంటి ❤️ లో ట్వీట్స్ లోకేష్ గారు అని ఒకరు ప్రశ్నిస్తే మరొకరు స్పందిస్తూ 'వాళ్ళు ఇలా ట్విట్స్ చేస్తే మీరు కేసు పెట్టచ్చు కదా.. ఎందు పెట్టట్లేదు అంటే మీరే ట్విట్లు క్రియేట్ చేసి మీరు ఆ ట్విట్లు వాళ్ళు ఏ పెడుతున్నారని మీరు పెడుతున్నారు.. సిగ్గు లేదు' అంటూ తిడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: