తమిళనాడు లోని కోయంబత్తూర్ లో  పదకొండవ  తరగతి బాలిక పై  ఆరుగురు కలిసి  సామూహిక అత్యాచారం చేసారు. వీరిలో నలుగురు నిందితులను పోలీసులు  పట్టుకోగా ఇద్దరు  నిందితులు తప్పించుకున్నారు. ఈ  ఇద్దరు నిందితులను  కనిపెట్టడానికి  కోయంబత్తూర్ నగర పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

 

 

నవంబర్ 26 న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు తన స్నేహితుడితో కలిసి పబ్లిక్ పార్కుకు వచ్చిన బాధితురాలి  పై జరిగిన రేప్ ను  నిందితులు చిత్రీకరించారని కోయంబత్తూర్ నగర పోలీసు కమిషనర్ సుమిత్ శరణ్ పేర్కొన్నారు.

 

 

శనివారం కోయంబత్తూర్ పోలీసులు  నలుగురు నిందితులు  టి. రాహుల్ (21), ఆర్. ప్రకాష్ (22), ఎస్. కార్తికేయన్(28) మరియు ఎస్. నారాయణమూర్తి (30) లను అరెస్ట్ చేసారు. వీరి దగ్గర నుండి లభ్యమైన మొబైల్ ఫోన్ లలో క్రైం కి సంబంధించిన  ఫోటోలు గాని వీడియోలు గాని దొరకలేదని పొలిసు కమిషనర్ చెప్పారు.  మరో ఇద్దరు నిందితులైన మణికందన్ మరియు  కార్తీక్  కోసం మూడు ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. ఈ ఇద్దరు నిందితులు  అరెస్టయ్యాక  వీరి  మొబైల్ ఫోన్లు పరిశీలించబడతాయి, ”అని కమిషనర్  అన్నారు.

 

 

బాలిక కధనం ప్రకారం సామూహిక హత్యాచారం తర్వాత నిందితులు ఆమెను మరియు ఆమె స్నేహితుడిని బెదిరించారు. పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ లోని 506 (ii) (క్రిమినల్ బెదిరింపు), సెక్షన్ 13 (అశ్లీల ప్రయోజనాల కోసం పిల్లల వాడకం), సెక్షన్ 9 (జి) (ఎవరైతే ముఠా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారో)  మరియు   సహా లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం యొక్క వివిధ నిబంధనలను పోలీసులు నిందితుల పై ఎఫ్ ఐ ఆర్ రిపోర్ట్ లో చేర్చారు.

 

 

ఈ సామూహిక హత్యాచారం  కోయంబత్తూరులో జరిగిన పొల్లాచి లైంగిక వేధింపుల కేసును గుర్తు చేస్తుంది. ఈ కేసు  లోక్ సభ  ఎన్నికలకు ముందు వెలుగులోకి  వచ్చింది, కొంతమంది  రాజకీయంగా పలుకుబడి ఉన్న  వ్యక్తులచే బలవంతంగా కొందరు బాలికలు వివస్త్రులను  చేసిన  వీడియోలు వెలువడ్డాయి. ఈ కేసులోని  నిందితులు చాలా మంది మహిళల పై  లైంగిక వేధింపులు, చిత్రీకరణ మరియు బ్లాక్ మెయిల్ చేశారు. సిబిఐ ఈ కేసు పై విచారణ  నిర్వహిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: