ఆర్టీసీ బస్సు బైక్‌‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందినట్లు సమాచారం. ఇంతకు ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఎక్కడంటే చిత్తూరు జిల్లాలో.. ఈ ప్రమాదానికి కారణం అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది.

 

 

పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్దపంజాణి మండలం కోగిలేరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో రామకృష్ణా రెడ్డి, రాజా రెడ్డి, చంద్రా రెడ్డి అనే ముగ్గురు యువకులు సంఘటన స్థలంలోనే మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే  చిత్తూరు ప్రజలను వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇదే పలమనేరు సమీపంలో మొగిలి ఘాట్ రోడ్డులో  బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ భారీ కంటైనర్ బోల్తా పడింది.

 

 

రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లి, అనంతరం బోల్తా పడింది. కంటైనర్ కింద ఆటో, ఓమ్నీ వ్యాన్, బైక్ చిక్కుకున్నాయి. అనంతరం కంటైనర్ నుంచి భారీగా మంటలు చెలరేగి వాహనాలు దగ్దమైయ్యాయి. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు ఇకపోతే ఈ కంటైనర్ బెంగళూరు నుంచి చిత్తూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

 

 

గత నెలలో కంటైనర్ అదుపుతప్పి దూసుకెళ్లిన ఘటనలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకోవడం అక్కడి స్దానికులను ఆందోళనకు గురిచేస్తుంది. ఇంట్లో నుండి బయటకు వెళ్లితే తిరిగి ఇంటికి చేరుకుంటామనే నమ్మకం రాను రాను ప్రజల్లో తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక చోటే కాదు. అన్ని చోట్ల ఈ రోడ్డు ప్రమాదాల వల్ల చాల మంది అమాయకులతో పాటుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు కూడా మరణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: